Bison Movie
Bison Movie : విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా అనుపమ పరమేశ్వరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా బైసన్. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్స్, నీలం స్టూడియోస్ బ్యానర్స్ పై పా. రంజిత్ సమర్పణలో సమీర్ నాయర్, దీపక్ సెగల్, అదితి ఆనంద్ నిర్మాణంలో మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా ఇప్పటికే తమిళ్ లో రిలీజవ్వగా జగదంబే ఫిల్మ్స్ బ్యానర్ పై తెలుగులో అక్టోబర్ 24న రిలీజ్ కానుంది. దీంతో తెలుగు ప్రమోషన్స్ లో భాగంగా బైసన్ మూవీ యూనిట్ తెలుగులో ప్రెస్ మీట్ నిర్వహించారు.(Bison Movie)
ఈ ప్రెస్ మీట్ లో హీరో ధృవ్ విక్రమ్ మాట్లాడుతూ.. తెలుగులో నా సినిమాని ప్రమోట్ చేసుకునేందుకు మొదటి సారి హైదరాబాద్ వచ్చాను. కొన్ని రోజుల క్రితం నేను ఇక్కడ షాపింగ్ చేసేందుకు వచ్చినప్పుడు ఆ షాప్ ఓనర్ మీరు విక్రమ్‌లా ఉన్నారు అని అన్నారు. నేను ఆయన కొడుకుని అని చెప్పడంతో మా నాన్న గారి కష్టం, సినిమా కోసం చేసే ప్రయోగాల గురించి ఆయన చాలా గొప్పగా చెప్పారు. నాకు కూడా తెలుగులో నటించాలని ఉంది. బైసన్ సినిమా కోసం మూడేళ్లు కష్టపడ్డాను. మారి సెల్వరాజ్ తన జీవితంలో ఎదురైన అనుభవాలు, సంఘటనల నుంచే కథల్ని రాసుకుంటారు. అర్జున అవార్డు గ్రహీత మణతి గణేషన్ కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా కోసం నేను కబడ్డీ నేర్చుకున్నాను అని అన్నారు.
Also See : Priyanka Chopra : అమెరికాలో ఫ్యామిలీతో ప్రియాంక చోప్రా దీపావళి సెలబ్రేషన్స్.. ఫొటోలు..
అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. మారి సెల్వరాజ్ మొదటి సినిమాలో నేను నటించాలి కానీ బిజీగా ఉండటం వల్ల కుదరలేదు. ఇన్నాళ్లకు ఆయన దర్శకత్వంలో బైసన్ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. తెలుగులో రిలీజ్ చేయాలనే డిమాండ్ తోనే ఇక్కడ కూడా రిలీజ్ చేస్తున్నాం అని అన్నారు.
నిర్మాత వీపీ సెల్వన్ బాలాజీ మాట్లాడుతూ.. లింగుస్వామి, నా సోదరుడు చంద్రబోస్ వల్లే తెలుగులోకి ఈ సినిమాని తీసుకువస్తున్నాను. తెలుగు ఆడియెన్స్‌కి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. ధృవ్ ఎంత కష్టపడ్డాడు అనేది సినిమా చూస్తే అర్థం అవుతుంది అని అన్నారు.
Also See : Raviteja : కామెడీ సినిమాటిక్ యూనివర్స్.. రవితేజ గెస్ట్ అప్పీరెన్స్.. ప్లాన్ అదిరిందిగా..