Raviteja : కామెడీ సినిమాటిక్ యూనివర్స్.. రవితేజ గెస్ట్ అప్పీరెన్స్.. ప్లాన్ అదిరిందిగా..

ఇటీవల తెలుగులో కొన్ని రోజుల క్రితం ఓ కామెడీ సినిమాటిక్ యూనివర్స్ కూడా ప్రకటించారు. (Raviteja)

Raviteja : కామెడీ సినిమాటిక్ యూనివర్స్.. రవితేజ గెస్ట్ అప్పీరెన్స్.. ప్లాన్ అదిరిందిగా..

Raviteja

Updated On : October 22, 2025 / 7:22 AM IST

Raviteja : ఇటీవల కొంతమంది దర్శక నిర్మాతలు పలు సినిమాలను, అందులోని పాత్రలను కలుపుతూ సినిమాటిక్ యూనివర్స్ లు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్, తమిళ్ లో ఈ సినిమాటిక్ యూనివర్స్ లు ఉండగా తెలుగులో కూడా ఇప్పుడిప్పుడు వస్తున్నాయి. ఇప్పటికే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ప్రకటించారు. ఇటీవల సుజీత్ ఓజి, సాహో సినిమాలు, రాబోయే సినిమాలతో కలిపి సుజీత్ సినిమాటిక్ యూనివర్స్ ప్రకటించాడు.(Raviteja)

ఇటీవల కొన్ని రోజుల క్రితం ఓ కామెడీ సినిమాటిక్ యూనివర్స్ కూడా ప్రకటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ లో వచ్చిన మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్, డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలు ఫుల్ కామెడీతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసి భారీ విజయం సాధించాయి. ఈ సినిమాలకు మ్యాడ్ క్యూబ్, టిల్లు క్యూబ్ కూడా ఉండొచ్చని గతంలోనే ప్రకటించారు. లేదా ఈ రెండిటిని కలుపుతూ సినిమాటిక్ యూనివర్స్ లా చేసి ఒక సినిమా ఉంటుందని దర్శకుడు కళ్యాణ్ శంకర్, నిర్మాత నాగవంశీ మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్స్ లో చెప్పుకొచ్చారు.

Also See : Rashmika Mandanna : ‘థామా’ సినిమా వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన రష్మిక మందన్న.. ఫోటోలు చూశారా?

తాజాగా రవితేజ, నిర్మాత నాగవంశీ మాస్ జాతర సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మ్యాడ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ తో ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు.

ఈ ఇంటర్వ్యూలో కళ్యాణ్ శంకర్.. మ్యాడ్ క్యూబ్, టిల్లు క్యూబ్ ప్లాన్స్ ఉన్నాయి. ఆ రెండిటిని కలిపి యూనివర్స్ అనుకుంటున్నాము. అందులో ఏదైనా మాస్, ఎనర్జీ క్యారెక్టర్ ఉంటే మీరు గెస్ట్ అప్పీరెన్స్ లా చేస్తారా అని అడగ్గా రవితేజ.. నేను రెడీ నువ్వు స్క్రిప్ట్ రెడీ చేయి చేస్తాను అని అన్నారు. దీంతో మ్యాడ్, టిల్లు సినిమాటిక్ యూనివర్స్ లో రవితేజ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. దీంతో రవితేజ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి.

Also Read : Atlee : వామ్మో 150 కోట్లు పెట్టి యాడ్ తీశారా? అల్లు అర్జున్ డైరెక్టర్ పై విమర్శలు.. ఇంతకీ ఆ యాడ్ ఏంటో తెలిస్తే..