Atlee : వామ్మో 150 కోట్లు పెట్టి యాడ్ తీశారా? అల్లు అర్జున్ డైరెక్టర్ పై విమర్శలు.. ఇంతకీ ఆ యాడ్ ఏంటో తెలిస్తే..
అల్లు అర్జున్ తో ప్రస్తుతం సినిమా తీస్తున్న డైరెక్టర్ అట్లీ డైరెక్ట్ చేసిన యాడ్ కి ఏకంగా 150 కోట్లు ఖర్చుపెట్టాడట. (Atlee)

Atlee
Atlee : మన సినిమాల బడ్జెట్స్ రోజురోజుకి పెరిగిపోతున్నాయి. వందల కోట్లు దాటేస్తున్నాయి. సినిమాలే అనుకుంటే ఇటీవల కమర్షియల్ యాడ్స్ బడ్జెట్స్ కూడా పెరిగిపోతున్నాయి. యాడ్స్ ని కూడా కోట్లు కోట్లు గుమ్మరించి తెరకెక్కిస్తున్నారు. గతంలో కమర్షియల్ యాడ్స్ తీయడానికి యాడ్ ఫిలిం మేకర్స్ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు స్టార్ డైరెక్టర్స్ సైతం యాడ్స్ డైరెక్ట్ చేస్తున్నారు.(Atlee)
తెలుగులో త్రివిక్రమ్, రాజమౌళి, బోయపాటి.. ఇలా ఎంతోమంది దర్శకులు యాడ్స్ డైరెక్ట్ చేసిన వాళ్ళే. ఇందుకు భారీగా రెమ్యునరేషన్ కూడా తీసుకుంటున్నారు. అయితే తాజాగా తమిళ్ డైరెక్టర్, అల్లు అర్జున్ తో ప్రస్తుతం సినిమా తీస్తున్న డైరెక్టర్ అట్లీ డైరెక్ట్ చేసిన యాడ్ కి ఏకంగా 150 కోట్లు ఖర్చుపెట్టాడట. ఇటీవల కొన్ని రోజుల క్రితం ఆ యాడ్ రిలీజ్ అయింది.
అది కూడా ఏకంగా 8 నిమిషాల యాడ్. ఆ యాడ్ రిలీజ్ కూడా బాలీవుడ్ లో ప్రీమియర్ షో అంటూ ఈవెంట్ పెట్టి హంగామా చేసారు. ఇవన్నీ చూసి ఒక యాడ్ కి ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారు అని సాధారణ ప్రేక్షకులు, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అసలు 8 నిముషాలు యాడ్ ఏంటి, దానికి 150 కోట్లు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు.
ఆ యాడ్ లో ఆర్మీ వాళ్ళని బంధించడం, ఏజెంట్ వచ్చి ఫైట్ చేసి కాపాడటం లాంటి యాక్షన్, చివర్లో ఓ సాంగ్ ని చూపించారు. ఇవన్నీ చూసి అదేదో గొప్ప యాడ్ అనుకునేరు. అట్లీ 150 కోట్లు ఖర్చుపెట్టింది కేవలం షెజ్వాన్ సాస్ యాడ్ కోసం. దీంతో ఒక సాస్ కి 150 కోట్లు, ఇంత పెద్ద యాక్షన్ యాడ్ ఎందుకు బ్రో అని అట్లీపై విమర్శలు చేస్తున్నారు. రోజురోజుకి క్రియేటివిటీ మరీ ఎక్కువ అయిందని కామెంట్స్ చేస్తున్నారు.
Also See : Nayanthara : మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో నయనతార ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్స్.. ఫొటోలు వైరల్..
బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్, శ్రీలీల, బాబీ డియోల్ లాంటి స్టార్స్ తో పాటు ఓ వంద మంది జూనియర్ ఆర్టిస్టులు, ఫైటర్స్ తో భారీగా యాడ్ తీశారు. ఇక లొకేషన్స్ కూడా భారీగా, రియాల్టీగా ఉండేలా ప్లాన్ చేసుకొని, గ్రాఫిక్ వర్క్స్ కూడా ఉండటం.. స్టార్స్ రెమ్యునరేషన్, అట్లీ రెమ్యునరేషన్.. ఇవన్నీ కలుపుకొని 150 కోట్లు అయిందని తెలుస్తుంది. మళ్ళీ దీనికోసం ప్రమోషనల్ ఈవెంట్ పెట్టడం ఇవన్నీ చూసి షాక్ అవుతున్నారు. వెర్రి వెయ్యి విధములు అంటే ఇదేనేమో అని అనుకుంటున్నారు. ఒక సాస్ ని జనాల్లోకి తీసుకెళ్లడానికి ఇంత ఖర్చుపెట్టాలా?
మీరు కూడా ఈ 150 కోట్ల షెజ్వాన్ సాస్ యాడ్ వీడియోని చూసేయండి..
Also Read : Sujeeth : పవన్ కళ్యాణ్ ‘ఓజి’ సినిమాకు సుజిత్ రెమ్యునరేషన్ ఎన్ని కోట్లు తెలుసా?