Sujeeth : పవన్ కళ్యాణ్ ‘ఓజి’ సినిమాకు సుజిత్ రెమ్యునరేషన్ ఎన్ని కోట్లు తెలుసా?
ఈ సినిమా తీసిన డైరెక్టర్ సుజీత్ కి ఫ్యాన్స్ గుడి కట్టేస్తాం అని కూడా అన్నారు. ఆ రేంజ్ లో సినిమా మెప్పించింది.(Sujeeth)

Sujeeth
Sujeeth : ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజి సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పవన్ ఫ్యాన్స్ అంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. పవన్ ని ఎన్నడూ చూడని స్టైలిష్ లుక్స్ లో చూసి ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోయారు. ఈ సినిమా తీసిన డైరెక్టర్ సుజీత్ కి ఫ్యాన్స్ గుడి కట్టేస్తాం అని కూడా అన్నారు. ఆ రేంజ్ లో సినిమా మెప్పించింది.(Sujeeth)
సుజీత్ కూడా పవన్ కళ్యాణ్ కల్ట్ ఫ్యాన్ అని తెలిసిందే. ఓజి హిట్ అవ్వడంతో ఈ సినిమాకు సీక్వెల్, ప్రీక్వెల్ కూడా ప్రకటించారు. ఇందుకు పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకున్నారు. తాజాగా సుజీత్ కి నిర్మాత దానయ్యకు మధ్య ఏవో సమస్యలు ఉన్నాయని రూమర్స్ రావడంతో సుజీత్ దానిపై క్లారిటీ ఇస్తూ ఓ పోస్ట్ కూడా పెట్టాడు. ఈ క్రమంలో సుజీత్ ఓజి రెమ్యునరేషన్ వైరల్ గా మారింది.
Also See : Nayanthara : మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో నయనతార ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్స్.. ఫొటోలు వైరల్..
టాలీవుడ్ సమాచారం ప్రకారం ఓజి సినిమాకు సుజీత్ కి నిర్మాత దానయ్య ఆరు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చారట. చివర్లో క్లైమాక్స్ రీ షూట్ కోసం కొంత ఖర్చు అయితే సుజీత్ తన రెమ్యునరేషన్ లో నుంచి కొంత పెట్టుకున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ సినిమా కాకుండా నాని సినిమాకు అడ్వాన్స్ గా కోటి రూపాయల వరకు సుజీత్ కి ఇచ్చారట దానయ్య.
అయితే ప్రస్తుతం నాని సినిమాకు నిర్మాతలు మారిన సంగతి తెలిసిందే. మరి ఆ డబ్బులు సుజీత్ దానయ్యకు తిరిగి ఇచ్చేశారా లేదా తెలియాలి.
Also See : Vaishnavi Chaitanya : బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య దీపావళి సెలబ్రేషన్స్.. ఫొటోలు..