Kalinga : హీరోనే దర్శకుడిగా.. కళింగ ఫస్ట్ లుక్ రిలీజ్.. విజయేంద్రప్రసాద్ చేతుల మీదుగా..

ధృవ వాయు హీరోగా నటిస్తూనే దర్శకత్వం వహించిన సినిమా ‘కళింగ’.

Kalinga : హీరోనే దర్శకుడిగా.. కళింగ ఫస్ట్ లుక్ రిలీజ్.. విజయేంద్రప్రసాద్ చేతుల మీదుగా..

Dhruva Vaayu Kalinga Movie Firts Look and Title Launched by Vijayendra Prasad

Updated On : July 10, 2024 / 7:40 AM IST

Kalinga : ఇటీవల కంటెంట్, కాన్సెప్ట్ సినిమాలు చాలానే వస్తున్నాయి. ఈ క్రమంలో కిరోసిన్ సినిమా ఫేమ్ ధృవ వాయు ఓ కొత్త కాన్సెప్ట్ సినిమాతో రాబోతున్నారు. ధృవ వాయు హీరోగా నటిస్తూనే దర్శకత్వం వహించిన సినిమా ‘కళింగ’. బిగ్ హిట్ ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్‌ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

Also See : Gladiator 2 : గ్లాడియేటర్ 2 ట్రైలర్ చూశారా? అదిరిపోయిందిగా..

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. సీనియర్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ కూడా పాల్గొన్నారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే ఆసక్తిగానే ఉంది.

Dhruva Vaayu Kalinga Movie Firts Look and Title Launched by Vijayendra Prasad

పోస్టర్‌లో కాగడా పట్టుకొని హీరో, అతని వెనకాల లక్ష్మీ నరసింహా స్వామి ఉగ్ర రూపంలో ఉన్న విగ్రహం ఉంది. ఇక ఈ సినిమాలో ప్రగ్యా నయన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఆడుకాలం నరేన్, లక్ష్మణ్ మీసాల, తనికెళ్ళ భరణి, సమ్మెట గాంధీ.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

Dhruva Vaayu Kalinga Movie Firts Look and Title Launched by Vijayendra Prasad