Different Love Story Drinker Sai Release Date Announced
Drinker Sai : ధర్మ, ఐశ్వర్య శర్మ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘డ్రింకర్ సాయి’. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనే ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు. ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మాణంలో కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, ఎస్ఎస్ కాంచి, భద్రం, కిర్రాక్ సీత, రీతు చౌదరి, ఫన్ బకెట్ రాజేశ్.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Also Read : Allu Arjun : ఆ థియేటర్లో ఫ్యాన్స్ తో కలిసి.. పుష్ప 2 ప్రీమియర్ షో చూడబోతున్న అల్లు అర్జున్..
ఇప్పటికే డ్రింకర్ సాయి సినిమా నుంచి టీజర్, ఓ సాంగ్ కూడా రిలీజ్ చేసారు. టీజర్ బాగా వైరల్ అయింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు. డ్రింకర్ సాయి సినిమా ఈ ఇయర్ ఎండింగ్ కి డిసెంబర్ 27న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాని వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కించినట్టు తెలిపారు మూవీ యూనిట్. మరి ఈ డిఫరెంట్ లవ్ స్టోరీ ఇయర్ ఎండింగ్ కి ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.