Digital Media Awards : VB ఎంటర్‌టైన్‌మెంట్స్ డిజిటల్ మీడియా అవార్డ్స్ 2025..
VB ఎంటర్‌టైన్‌మెంట్స్ డిజిటల్ మీడియా అవార్డ్స్- 2025 పేరిట అవార్డులు అందించారు.

Digital Media Awards by VB Entertainments 2025 Event Happened
Digital Media Awards : డిజిటల్ మీడియా రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి VB ఎంటర్‌టైన్‌మెంట్స్ డిజిటల్ మీడియా అవార్డ్స్- 2025 పేరిట అవార్డులు అందించారు. తాజాగా ఈ వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో డిజిటల్ మీడియా రంగంలో వివిధ విభాగాల్లో విజేతలు అవార్డులు అందుకున్నారు. VVK సంస్థ సమర్పణలో వీబి ఎంటర్‌టైన్‌మెంట్స్ ఆధ్వర్యంలో VB ఎంటర్టైన్మెంట్స్ అధినేత, ఈసీ మెంబర్ ఆఫ్ మా అయిన విష్ణు బొప్పన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు యూట్యూబ్ ఛానల్స్ లో వివిధ విభాగాల్లో పనిచేసే వారికీ అవార్డులు అందచేశారు.
విజేతలకు సీనియర్ ప్రొడ్యూసర్ అంబికా కృష్ణ చేతుల మీదుగా అవార్డ్స్ అందించారు. ఈ క్రమంలో అంబికా కృష్ణ మాట్లాడుతూ.. ప్రింట్ మీడియా కంటే డిజిటల్ మీడియా ఇంకా బాగా అభివృద్ధి చెందింది. డిజిటల్ మీడియా ప్రజలకు మంచి వార్తలు ఇవ్వాలి. ఈ అవార్డులు అందచేస్తున్న విష్ణు గత 10 సంవత్సరాల నుంచి చిన్న పిల్లలకు ఎన్నో విధాలుగా సాయపడ్డారు, అనాధ పిల్లలకు అండగా నిలిచారు అని అన్నారు.
Also Read : Samantha : ఆస్ట్రేలియాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సమంత.. క్యూట్ ఫోటోలు వైరల్..
విష్ణు బొప్పన మాట్లాడుతూ.. అవార్డులు అందుకున్నవారికి అభినందనలు తెలిపి ముఖ్య అతిధులుగా విచ్చేసిన నిర్మాతలు అంబికా కృష్ణ, KS రామారావులకు, ప్రతి సంవత్సరం పేద పిల్లలకి సాయం చెయ్యడానికి తనకి తోడుగా ఉన్న స్పాన్సర్ లకు కృతజ్ఞతలు తెలిపారు.