Dil Raju : ఓటీటీలు ఒప్పుకున్నాయి.. కానీ నిర్మాతలే.. ఇకపై ఏ సినిమా ఏ ఓటీటీలోకి ముందే తెలిసే ఛాన్స్ లేనట్టే..

తమ్ముడు ప్రమోషన్స్ లో భాగంగా దిల్ రాజు నేడు మీడియాతో మాట్లాడారు.

Dil Raju Interesting Comments on OTT Announcement with Movie Release

Dil Raju : థియేటర్స్ కి జనాలు రాకపోవడానికి కారణాల్లో ఓటీటీ ఒకటి. అందులోనూ సినిమా రిలీజయిన నెల రోజుల్లోనే ఓటీటీలోకి వస్తుండటం, ఏ ఓటీటీలోకి వస్తుందో థియేటర్లో ముందే వేసేయడంతో సినిమా రిలీజ్ రోజే అది ఏ ఓటీటీలోకి వస్తుందో తెలిసిపోతుంది. దీంతో నెల రోజుల్లోకి ఫలానా ఓటీటీలో వచ్చేస్తుంది కదా అని జనాలు థియేటర్స్ కి రావడం తగ్గిస్తున్నారు.

దీనిపై గతంలో నిర్మాతలు ఓటీటీ సంస్థలతో మాట్లాడారని సమాచారం. తాజాగా దిల్ రాజు దీనిపై స్పందించారు. తమ్ముడు ప్రమోషన్స్ లో భాగంగా దిల్ రాజు నేడు మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో 10 టీవీ ప్రతినిధి.. సినిమా ఏ ఓటీటీలో వస్తుందో ముందే చెప్పేస్తున్నారు, సినిమాతో పాటు ప్రకటించేస్తున్నారు, మళ్ళీ మీరే థియేటర్స్ కి జనాలు రావట్లేదు అంటున్నారు, కనీసం నెల రోజుల్లో ఓటీటీలోకి సినిమాని ఆపకపోయినా ఏ ఓటీటీలోకి వస్తుందో ప్రకటించడం ఆపొచ్చు కదా అని ప్రశ్నించారు.

Also Read : Hari Hara Veera Mallu : ‘హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు’ ట్రైల‌ర్ చూసిన ప‌వ‌న్.. ప‌క్క‌నే త్రివిక్ర‌మ్ కూడా..

దీనికి దిల్ రాజు సమాధానమిస్తూ.. ఆల్రెడీ గతంలో దీనిపై అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లాంటి ఓటీటీ సంస్థలతో మాట్లాడాము. సినిమాకు బ్యాడ్ జరుగుతుంటే ఎందుకు, సినిమాలో ఓటీటీ సంస్థ పేరు వేయకపోయినా పర్లేదు అని ఓటీటీ వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ నిర్మాతలే ఇంకా ఆపట్లేదు, వేరే నిర్మాతలు ఎందుకు వేస్తున్నారో తెలీదు. మళ్ళీ దీని గురించి నిర్మాతలతో మాట్లాడి ఓటీటీ ప్రకటన లేకుండా ఉండటానికి చూస్తాము అని తెలిపారు. మరి దిల్ రాజు నిర్మాతలతో మాట్లాడి ఓటీటీ ప్రకటన ఆపితే ఎంతో కొంత సినిమాకు మంచి జరిగినట్టే. అప్పుడు సినిమా ఏ ఓటీటీలోకి వస్తుందో ముందే తెలిసే అవకాశం ఉండదు కూడా.

Also Read : Dil Raju : పెద్ద సాహసమే చేస్తున్న దిల్‌రాజు.. త‌మ్ముడు మూవీ విష‌యంలో..