Dil Raju Wife Tejaswini Vygha Interesting Comments on Pawan Kalyan
Dil Raju Wife : సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉండే దిల్ రాజు భార్య తేజస్విని తాజాగా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
తేజస్విని మాట్లాడుతూ.. నేను చిన్నప్పుడు ఖుషి నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని. వకీల్ సాబ్ సినిమా మా నిర్మాణ సంస్థలోనే తెరకెక్కింది. వకీల్ సాబ్ షూటింగ్లో చూసాను. అప్పుడు ఒక ఫ్యాన్ గా చాలా ఎగ్జైటెడ్ అయ్యాను. పవన్ గారి స్మైల్ నాకు చాలా ఇష్టం. అప్పుడు కలిసి మాట్లాడదాం అనుకుంటే పవన్ గారి బిజీ వాళ్ళ కుదరలేదు.
వకీల్ సాబ్ రిలీజ్ అయ్యాక నేను, రాజు గారు వెళ్లి కలిసాము. సినిమా గురించి మాట్లాడాను పవన్ కళ్యాణ్ గారితో. ఆయన.. మీరు నా ఆడబిడ్డ, సినిమా గురించి బాగా చెప్పారు అని అన్నారు. చాలా మంచి పర్సన్. ఆయన మంచి మనసుతో మాట్లాడతారు. మీరేమన్నా ఆయనకు సమస్యలు చెప్తే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆ సమస్యని చూస్తారు. సమస్యలు ఉన్నవాళ్లకు ఏదో ఒకటి చేయాలి అనుకుంటారు అని తెలిపింది.
Also Read : Dil Raju Wife : వామ్మో దిల్ రాజు భార్య ఇన్ని చదువుకుందా.. పెళ్లి తర్వాత కూడా చదువు..