Ashu Reddy : అషురెడ్డి చేయాల్సిన క్యారెక్టర్ వేరే నటికి.. నిర్మాత ఆడిషన్స్ కి రమ్మంటే.. ఏం చెప్పి ఛాన్స్ పోగొట్టుకుందో తెలుసా?
తాజాగా అషు ఆహా కాకమ్మ కథలు షోకి రాగా ఈ విషయాన్ని తెలిపింది.

Ashu Reddy Lost her Chance in a Web Series
Ashu Reddy : సినీ పరిశ్రమలో ఒకరు చేయాల్సిన పాత్ర పలు కారణాలతో ఇంకొకరికి వెళ్తూ ఉంటుందని తెలిసిందే. తాజాగా నటి, బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డి తాను చేయాల్సిన పాత్ర వేరే వాళ్లకు వెళ్లిందని, నేనే మిస్ చేసుకున్నాను అని తెలిపింది. తాజాగా అషు ఆహా కాకమ్మ కథలు షోకి రాగా ఈ విషయాన్ని తెలిపింది.
అషురెడ్డి మాట్లాడుతూ.. ఆహాలో 3 రోజెస్ సిరీస్ సీజన్ 2లో ఛాన్స్ వచ్చింది. నిర్మాత ఆడిషన్స్ కి రమ్మన్నారు. కానీ నేను న్యూమరాలజి బాగా నమ్ముతాను. దాని ప్రకారం డేట్స్ చూసుకొనే వెళ్తాను. ఆయన పిలిచిన డేట్ కి వెళ్ళకూడదు నా న్యూమరాలజీ ప్రకారం. మరో డేట్ చూసుకొని వస్తాను, ఇంకో డేట్ ఉంటే చెప్పండి అని అడిగాను. దాంతో నీ కోసం ఆడిషన్ డేట్ మారుస్తారా అని అడిగారు. నాలుగు రోజుల్లో సిరీస్ మొదలవ్వాలి. వాళ్ళ అర్జెంట్ వాళ్లకు ఉంది. తర్వాత నిన్ను తీసుకోవాలనుకున్నాం కానీ వేరే వాళ్ళను తీసుకున్నాం అని నాకు మెసేజ్ కూడా చేసారని తెలిపింది.
Also Read : Dil Raju Wife : వామ్మో దిల్ రాజు భార్య ఇన్ని చదువుకుందా.. పెళ్లి తర్వాత కూడా చదువు..
ఆహా 3 రోజెస్ వెబ్ సిరీస్ మొదటి సీజన్ లో పూర్ణ, పాయల్ రాజ్ పుత్, ఈషా రెబ్బ నటించగా సెకండ్ సీజన్ లో ఈషా రెబ్బ, కుషిత కళ్లపు, రాశి సింగ్ నటిస్తున్నారు. కుషిత కళ్లపు పాత్రలోనే అషురెడ్డిని తీసుకోవాలనుకున్నట్టు తెలుస్తుంది.