Diol Raju Wants to start again Movie Audio Launch Event
Dil Raju : ఇప్పుడంటే సినిమా ప్రమోషన్స్ కొత్త పుంతలు తొక్కి రకరకాలుగా జరుగుతుంది. సినిమా రిలీజ్ కి ముందు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇంటర్వ్యూలు, కాలేజీ టూర్లు, రోడ్ల మీదకి వెళ్లి విన్యాసాలు.. ఇలా రకరకాల ప్రమోషన్స్ చేస్తున్నారు సినిమా వాళ్ళు. కానీ గతంలో సినిమాకి మెయిన్ ప్రమోషన్ అంటే కేవలం ఆడియో లాంచ్ ఈవెంట్ ఒక్కటే. ప్రతి సినిమాకి ఘనంగా ఆడియో లాంచ్ ఈవెంట్ చేసేవాళ్ళు.
సినిమా పాటలని రిలీజ్ చేయడానికి మాత్రమే కాక సినిమాని ఒక్కసారిగా ప్రమోట్ చేసి జనాల్లోకి తీసుకెళ్లడానికి ఆడియో లాంచ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు. కానీ యూట్యూబ్ లో పాటలు రిలీజ్ చేయడం, టీజర్, ట్రైలర్స్ అంటూ రిలీజ్ ఈవెంట్స్ చేయడం.. ఇలా కాల క్రమేణా ఆడియో లాంచ్ ఈవెంట్ ని అందరూ ఆపేసారు. దీంతో ఆ పూర్వ వైభవాన్ని మళ్ళీ తీసుకురావాలని దిల్ రాజు అనుకుంటున్నారు.
దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ లో దిల్ రాజు కూతురు హన్షిత, అల్లుడు హర్షిత్ నిర్మాతలుగా పలు సినిమాలని తెరకెక్కిస్తున్నారు. వైష్ణవి చైతన్య, ఆశిష్ జంటగా అరుణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘లవ్ మీ ఇఫ్ యు డేర్’. ఈ సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఓ సాంగ్, టీజర్ రిలీజ్ చేసి దయ్యం ప్రేమకథ అంటూ సినిమాపై ఆసక్తి పెంచారు.
తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమాకి గ్రాండ్ గా ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించబోతున్నాం అని దిల్ రాజు, ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తెలిపారు. రేపు ఉగాది నాడు ఏప్రిల్ 9న సాయంత్రం ‘లవ్ మీ ఇఫ్ యు డేర్’ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు. ఈ ఈవెంట్లో కీరవాణితో పాటు పలువురు సింగర్స్ కూడా పాల్గొని ఈ సినిమా పాటలని పెర్ఫార్మ్ చేయబోతున్నట్టు తెలిపారు.
#LoveMe – '?? ??? ????' brings back the glorious trend of an audio launch event to Telugu Cinema ❤️?#LoveMe Audio Launch Event with live performances of @mmkeeravaani & other singers ✨
On April 9th from 4 PM onwards. This Ugadi will begin with a musical feast ?
In… pic.twitter.com/zyUeDn3Yah
— Dil Raju Productions (@DilRajuProdctns) April 7, 2024