Ravibabu: ఒళ్లు బ*సి సినిమాలు చేస్తున్నారు.. క్రమశిక్షణ లేదు.. రవిబాబు షాకింగ్ కామెంట్స్
ప్రజెంట్ జనరేషన్ ఫిలిం మేకింగ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన నటుడు, దర్శకుడు రవిబాబు(Ravibabu).
Director and actor Ravi Babu Shocking Comments on Present Generation Filmmaking
- సినిమా మేకింగ్ పై రవిబాబు ఘాటు వ్యాఖ్యలు.
- డిజిటల్ టెక్నాలజీతో తగ్గిన క్రమశిక్షణ.
- రవిబాబు మాటలపై నెటిజన్ల భిన్నాభిప్రాయాలు.
Ravibabu: ప్రముఖ నటుడు, దర్శకుడు రవిబాబు చేస్తున్న తాజా చిత్రం ‘రేజర్’. మోస్ట్ వైలెట్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా మే 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తెలుగు చిత్ర పరిశ్రమలో మారుతున్న పనితీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. ఒకప్పుడు సినిమా రంగంలో క్రమశిక్షణ ఎక్కువగా ఉండేదని, ప్రస్తుతం అది లోపించిందని ఆయన అభిప్రాయపడ్డారు. అప్పట్లో ఫిల్మ్ మేకింగ్‌లో ఉన్న నిబద్ధత, బాధ్యతాయుతమైన ప్రవర్తన ఇప్పుడు కనిపించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Jyoti Poorvaj: పింక్ చీరలో దేవకన్యలా.. జ్యోతి పూర్వాజ్ నాభి అందాలకు కుర్రకారు క్లీన్ బౌల్డ్
పూర్వం ఫిల్మ్ రీల్స్ ద్వారా షూటింగ్ జరిగేటప్పుడు అది చాలా ఖరీదైనది కావడంతో నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు ఎంతో జాగ్రత్తగా ఒళ్ళు దగ్గరపెట్టుకొని ఉండేవారని రవిబాబు గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం డిజిటల్ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో సమయం, ఖర్చుపై గౌరవం తగ్గిందని ఆయన విమర్శించారు. చిప్‌ల వాడకం పెరగడం వల్ల మేకింగ్‌లో నిర్లక్ష్యం చోటుచేసుకుందని, టెక్నాలజీపై సరైన అవగాహన లేకపోవడం వల్ల ప్రొడక్షన్ ప్లానింగ్‌లో క్రమశిక్షణ కొరవడిందని ఆయన పేర్కొన్నారు.
అయితే, “ఒళ్లు బలిసి సినిమాలు చేస్తున్నారు” అని ఆయన వాడిన పదజాలంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు నెటిజన్లు రవిబాబు(Ravibabu) వ్యాఖ్యలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయని సమర్థిస్తుండగా, మరికొందరు మాత్రం తోటి సాంకేతిక నిపుణులను ఉద్దేశించి అలాంటి కఠినమైన పదాలు వాడటం సరైన పద్ధతి కాదని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా, సినిమా మేకింగ్‌లో వచ్చిన మార్పులపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
