Unstoppable With NBK : బాల‌య్య అన్‌స్టాప‌బుల్‌లో డాకు మ‌హారాజ్ ద‌ర్శ‌కుడు..

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాప‌బుల్ షో కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు

Director Bobby Kolli Producer Naga Vamsi and Music Director in Unstoppable show

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాప‌బుల్ షో కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఆహా వేదిక‌గా స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో ఇప్ప‌టికే విజ‌య‌వంతంగా మూడు సీజ‌న్లు పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం నాలుగో సీజ‌న్ న‌డుస్తోంది. ఏడు ఎపిసోడ్‌లు స్ట్రీమింగ్ కాగా వాటికి అదిరిపోయే స్పంద‌న వ‌చ్చింది. ఇక ఎనిమిదో ఎపిసోడ్‌కు ఎవ‌రు రానున్నారా అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

బాబీ ద‌ర్శ‌క‌త్వంలో బాల‌కృష్ణ న‌టిస్తున్న మూవీ డాకు మహారాజ్‌. శ్ర‌ద్ధా శ్రీనాథ్‌, ప్ర‌గ్యా జైస్వాల్ క‌థానాయిక‌లు. బాబీ దేవోల్‌, చాందిని చౌద‌రి ముఖ్య‌పాత్ర‌లు పోషిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Laila : విశ్వ‌క్ సేన్ ‘లైలా’ మూవీ నుంచి ‘సోను మోడ‌ల్’ సాంగ్ వ‌చ్చేసింది.. అదిరిపోయిన స్టెప్పులు..

ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో ఈ చిత్ర ప్రమోష‌న్స్‌లో భాగంగా ద‌ర్శ‌కుడు బాబీ, నిర్మాత నాగ‌వంశీ, సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్‌లు అన్‌స్టాప‌బుల్‌లో సంద‌డి చేయ‌నున్నారు.

ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్ హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో నేడు (ఆదివారం) జ‌రుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Top Directors of 2024 : 2024లో భారీ సక్సెస్ అందుకున్న ద‌ర్శ‌కులు వీళ్లే..