Uppena 2 : ప్రపంచంలోనే ఎవరూ రాయని కథ ‘ఉప్పెన 2’

‘ఉప్పెన 2’ ఇప్పటివరకు ప్రపంచంలోనే ఎవరూ రాయని కథ అవుతుంది - డైరెక్టర్ బుచ్చిబాబు..

Uppena 2 : ప్రపంచంలోనే ఎవరూ రాయని కథ ‘ఉప్పెన 2’

Buchi Babu

Updated On : October 21, 2021 / 5:42 PM IST

Uppena 2: ‘ఉప్పెన’.. తెలుగు సినిమా ప్రేమకథల్లో ఎవరూ ఊహించని సరికొత్త షాకింగ్ లవ్ స్టోరీ. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు, మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి, విజయ్ సేతుపతి, రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్, మైత్రీ మూవీ మేకర్స్ అంతా కలిసి బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేశారు.

Prabhas : ప్రభాస్ ఫ్యామిలీ గొప్పదనం.. పనిమనిషికి సన్మానం..

టాలీవుడ్‌లో ఇప్పటివరకు ఏ డెబ్యూ హీరోకి లేని సాలిడ్ రికార్డ్ నెలకొల్పాడు వైష్ణవ్. వంద కోట్ల గ్రాస్ వసూల్ చేసి ట్రేడ్ వర్గాల వారిని సైతం ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా తర్వాత దర్శకుడు బుచ్చిబాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి కథ చెప్పడాని, త్వరలో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని ఫిలిం నగర్ టాక్.

Prabhas : సింహం.. తిమింగలం.. ప్రభాస్ ఫ్యాన్స్ బ్యానర్స్ అదుర్స్..

ఇదిలా ఉంటే రీసెంట్‌గా ఓ ఇంటర్వూలో ‘ఉప్పెన 2’ గురించి చెప్పుకొచ్చాడు బుచ్చి బాబు. ముందుగా ‘ఉప్పెన 2’ ఆలోచించిన తర్వాతే ‘ఉప్పెన 1’ కథ రాసుకున్నానని.. ‘ఉప్పెన 2’ మంచి కథ అవుతుందని, ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలోనే రాయని ఒక స్టోరీ అవుతుందని చెప్పాడు. ‘ఉప్పెన’ తో బాక్సాఫీస్ వద్ద ‘ఉప్పెన’ తెచ్చి పెట్టిన బుచ్చిబాబు నుండి త్వరలోనే ‘ఉప్పెన 2’ ఎక్స్‌పెక్ట్ చొయ్యొచ్చన్న మాట..

Bheemla Nayak : రిలాక్స్ అవుతున్న ‘భీమ్లా నాయక్’.. డానియెల్ శేఖర్.. లుక్ అదిరిందిగా!