వైరల్ అవుతున్న హరీష్ శంకర్ ‘చైనా’ పురాణం..
టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ చేసిన ‘చైనా’ పురాణం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ చేసిన ‘చైనా’ పురాణం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
దర్శకుడు హరీష్ షేర్ చేసిన ‘చైనా’ పురాణం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పబ్లిక్ ఇబ్బంది పడుతున్న విషయాలను(సోషల్ ఇష్యూస్) ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ, ఆ ప్రాబ్లమ్ ఎవరి ద్వారా వచ్చిందో వారికి లింక్ చేసే విషయంలో హరీష్ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉంటాడు.
తాజాగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ విషయంలో కూడా ఎప్పటికప్పుడు ఆయన తన స్టైల్లో రియాక్ట్ అవుతూనే ఉన్నాడు. ఈ మహమ్మారి గురించి తీసుకోవలసిన జాగ్రత్తల విషయంలో ఇతరులు ఎవరైనా మంచి విషయాన్ని పోస్ట్ చేస్తే దానిని రీ ట్వీట్ చేస్తున్నాడు.
తాజాగా వాట్సప్‌లో ఫార్వర్డ్ అవుతున్న కరోనా పుట్టిల్లు ‘చైనా’ కవితను ఆయన ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. ‘చైనా’ పురాణంలా ఉన్న ఈ కవితలో టైమింగ్‌తో కూడిన రైమింగ్‌తో పాటు మంచి మెసేజ్ కూడా ఉండటం విశేషం.
Read Also : కరోనా- ‘సామజవరగమనా.. నేనిల్లు దాటగలనా!’.. వైరల్ అవుతున్న పేరడీ సాంగ్..
‘‘ఇటునుం ‘‘చైనా’’
అటునుం ‘‘చైనా’’
ఎటునుం ‘‘చైనా’’
వచ్చి ఉండవచ్చుగాక
ఇకనుం ‘‘చైనా’’ జాగ్రత్తగా ఉంటే మంచిది..
దాని మెడలు వం ‘‘చైనా’’ పంపిద్దాం
ప్రజలకు కాస్త వివరిం ‘‘చైనా’’ చెబుదాం.
వారికి కాస్త మం ‘‘చైనా’’ చేద్దాం
అంతకు మిం ‘‘చైనా’’ సాధిద్దాం’’..
అంటూ హరీష్ పోస్ట్ చేసిన ఈ ‘చైనా’ పురాణంపై నెటిజన్లు ఆకట్టుకుంటుండంతో ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. సినిమాల విషయానికొస్తే త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యణ్‌తో ఓ చిత్రం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు హరీష్ శంకర్.
ఇటునుం” *చైనా* “
అటునుం *”చైనా”*
ఎటునుం *”చైనా”*
వచ్చి ఉండవచ్చుగాక
ఇకనుం *”చైనా”* జాగ్రత్తగా ఉంటే మంచిది..
దాని మెడలు వం *”చైనా”* పంపిద్దాం
ప్రజలకు కాస్త వివరిం *”చైనా”* చెబుదాం.
వారికి కాస్త మం *”చైనా”* చేద్దాం
అంతకు మిం *”చైనా”* సాధిద్దాం..(Whatsapp forward )
— Harish Shankar .S (@harish2you) March 24, 2020