Retro : సినిమానే చాలా ల్యాగ్ ఉంది అంటే.. ఎడిటింగ్ లో తీసేసిన 40 నిముషాలు జత చేసి ఓటీటీలో రిలీజ్ చేస్తారంట..

గా ల్యాగ్ ఉన్న సినిమాకు కూడా ఎడిటింగ్ వర్షన్ లో కట్ చేసిన 40 నిముషాలు యాడ్ చేసి రిలీజ్ చేస్తాను అంటున్నాడు డైరెక్టర్.

Director Karthik Subbaraj Wants to Release Full Version of Suriya Retro Movie

Retro Movie : సినిమా షూటింగ్ కి ఫైనల్ గా రిలీజ్ అయ్యే దానికి మధ్యలో ఎడిటింగ్ లో చాలా వరకు సీన్స్ కట్ చేస్తూ ఉంటారు. అలా ఎడిటింగ్ లో పోయిన సీన్స్ కొన్ని సినిమాలకు నిడివి ఎక్కువే ఉంటుంది. అయితే హిట్ అయిన సినిమాలకు ఫ్యాన్స్ ఆ ఎడిటెడ్ వర్షన్ ని రిలీజ్ చేయమని అడుగుతూ ఉంటారు. మూవీ మేకర్స్, డైరెక్టర్స్ కూడా ఫ్యాన్స్ కోసం, కమర్షియల్ గా వర్కౌట్ చేసుకోడానికి ఎడిటింగ్ లో తీసేసింది కూడా కలిపి ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు ఈ మధ్య.

కానీ తాజాగా ఓ ఫ్లాప్ సినిమా, బాగా ల్యాగ్ ఉన్న సినిమాకు కూడా ఎడిటింగ్ వర్షన్ లో కట్ చేసిన 40 నిముషాలు యాడ్ చేసి రిలీజ్ చేస్తాను అంటున్నాడు డైరెక్టర్.

Also Read : Viraatapalem : సూపర్ నేచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఏ ఓటీటీలో?

డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఇటీవల సూర్యతో రెట్రో అనే సినిమా తీసాడు. ఈ సినిమా రెగ్యులర్ రొటీన్ స్టోరీనే. దానికి తోడు చాలా సాగదీసి సాగదీసి ఈ సినిమాని థియేటర్స్ లో చూపించారు. ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా సినిమా అంతా చాలా ల్యాగ్ ఉందని, ఎడిటింగ్ లో చాలా కట్ చేసేయొచ్చని అన్నారు. సోషల్ మీడియాలో ఈ సినిమా ల్యాగ్ పై బాగానే ట్రోలింగ్ జరిగింది. తమిళ్ లో యావరేజ్ గా నిలిచినా తెలుగులో మాత్రం ఈ సినిమా డిజాస్టర్ అయింది. కానీ మూవీ యూనిట్ ఇదేమి పట్టించుకోకుండా సినిమా సూపర్ హిట్ అంటూ 200 కోట్లు పైన కలెక్ట్ చేసింది అంటూ రిలీజ్ సమయంలో ప్రమోషన్ చేసారు.

రెట్రో సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్. ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. రెట్రో సినిమాకి ఎడిటింగ్ లో కట్ చేసింది ఇంకో 40 నిముషాలు ఉంది. అది కూడా కలిపి ఇంకో వర్షన్ ని ఓటీటీలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఓటీటీలో దీని గురించి డీల్ మాట్లాడుతున్నాం. వాళ్ళు ఓకే అంటే రెట్రో సినిమా ఫుల్ వర్షన్ రిలీజ్ చేస్తాను అని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు కార్తీక్ సుబ్బరాజ్.

Also Read : Anchor Lasya : ఫాదర్స్ డే స్పెషల్.. నాన్నకు కార్ కొనిచ్చిన యాంకర్ లాస్య.. ఫొటోలు చూశారా?

దీంతో మరోసారి ఈ దర్శకుడిపై ట్రోల్స్ చేస్తున్నారు. ఆల్రెడీ థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమానే చాలా ల్యాగ్ ఉంది అంటే దానికి ఇంకో 40 నిముషాలు ఎందుకు యాడ్ చేస్తున్నారు, ఇంకా ల్యాగ్ చేయడానికా? కుదిరితే ఎడిటింగ్ చేసి సీన్స్ తీసేయండి అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మరి డైరెక్టర్ రెట్రో ఫుల్ వర్షన్ రిలీజ్ చేస్తారా లేదా చూడాలి.