Viraatapalem : సూపర్ నేచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఏ ఓటీటీలో?
1980 బ్యాక్ డ్రాప్ లో ఓ మారుమూల గ్రామం విరాటపాలెం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

Viraatapalem PC Meena Reporting Super Natural Thriller Web Series ott Streaming
Viraatapalem : ఇటీవల ‘రెక్కీ’ లాంటి థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ ని తీసుకువచ్చిన మేకర్స్ ఇప్పుడు ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ అనే సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్ తో రాబోతున్నారు. సౌత్ ఇండియన్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీరామ్ నిర్మాణంలో కృష్ణ పోలూరు దర్శకత్వంలో అభిజ్ఞా వూతలూరు, చరణ్ లక్కరాజు మెయిన్ లీడ్స్ లో ఈ సిరీస్ తెరకెక్కింది.
1980 బ్యాక్ డ్రాప్ లో ఓ మారుమూల గ్రామం విరాటపాలెం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ ఊరికి ఉన్న శాపం, ప్రతి వధువు తన పెళ్లి రోజున మరణించడం, దీంతో దశాబ్ద కాలంగా ఏ వివాహం జరగకపోవడం, ఆ గ్రామంలో అసలు పెళ్లిళ్లు అనేవి జరగకుండా భయంతో ఉండే సమయంలో ఒక పోలీసు కానిస్టేబుల్ (అభిజ్ఞ వూతలూరు) ఆ గ్రామానికి రావడం, అక్కడి శాపం గురించి తెలుసుకోవడం, ఆ రహస్యాన్ని ఛేదించడం అనే కథాంశంతో ఈ సిరీస్ ని తెరకెక్కిస్తున్నారు. ట్రైలర్ జూన్ 19న రిలీజ్ చేయనున్నారు.
Also See : Anchor Lasya : ఫాదర్స్ డే స్పెషల్.. నాన్నకు కార్ కొనిచ్చిన యాంకర్ లాస్య.. ఫొటోలు చూశారా?
ఈ సిరీస్ అనౌన్స్ సందర్భంగా జీ5 తెలుగు బిజినెస్ హెడ్ అనురాధ గూడూర్ మాట్లాడుతూ.. విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్ సిరీస్ ఉత్కంఠను కలిగిస్తూనే సామాజిక సందేశాన్ని కూడా అందిస్తుంది. భయం అనేది సమాజాన్ని ఎలా నియంత్రించగలదో, ధైర్యం అనేది దశాబ్దాల నిశ్శబ్దాన్ని ఎలా భంగపరచగలదో ఈ సిరీస్ చూపిస్తుంది అని తెలిపారు. డైరెక్టర్ కృష్ణ పోలూరు మాట్లాడుతూ.. రెక్కీ తర్వాత మరోసారి జీ5తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. దశాబ్ద కాలంగా వివాహాలను ఆపివేసిన గ్రామంలోని ఆ నిశ్శబ్దాన్ని ఛేదించడమే ఈ సిరీస్ కథ. అక్కడ ఒక స్త్రీ అందరూ భయపడే ప్రశ్న అడగడానికి ధైర్యం చేస్తుంది అని అన్నారు.
విరాటపాలెం ఊరి అమ్మాయిలు, పెళ్ళి చేసుకుందాం అనుకుంటుంటే, వెనకడుగు వేయండి!
ఈ ఊరి సంగతేంటో చూద్దాం, పదండి#ViraatapalemOnZee5 PREMIERES 27th JUNE
From the director and makers of the blockbuster #RecceOnZee5@abhignya_v@CharanLakkaraju @southindianscreens@DivyaThejaswi pic.twitter.com/mFAzFMmVKc
— ZEE5 Telugu (@ZEE5Telugu) June 17, 2025
నిర్మాత శ్రీరామ్ మాట్లాడుతూ.. ఈ కథ నాకు మొదటి నుంచీ ప్రత్యేకంగా నిలిచింది. ఈ కథ విన్నప్పటి నుంచీ నన్ను వెంటాడుతూనే ఉంది. ఈ సిరీస్‌తో మేం నిర్మించిన ప్రపంచం గురించి ఎంతో గర్విస్తున్నాను అని అన్నారు. నటి అభిజ్ఞ వూతలూరు మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ పాత్రలో చాలా సున్నితత్వం, బలం ఉంటుంది. రియల్ లొకేషన్స్, గ్రామీణ వ్యక్తులతో కలిసి షూటింగ్ చేయడం మర్చిపోలేని అనుభూతి అని తెలిపారు. రీస్ జూన్ 27న జీ5లో స్ట్రీమింగ్ అవ్వనుంది.
Also Read : Suma Kanakala : యాంకర్ సుమకు సన్మానం.. టాలీవుడ్ అంతా కలిసి..? లీక్ చేసేసిన నిర్మాత..