Madhur Bhandarkar : రీమేక్ సినిమాలు ఇకనైనా ఆపేయండి.. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వ్యాఖ్యలు..

మొదటి నుంచి కూడా కంటెంట్ ఓరియెంటెడ్ తో ఒరిజినల్ కథలతో సినిమాలను తెరకెక్కించారు మధుర్ భండార్కర్. తాజాగా మధుర్ భండార్కర్ రీమేక్ సినిమాల గురించి మాట్లాడుతూ...................

Director Madhur Bhandarkar comments on Bollywood Remake movies

Madhur Bhandarkar :  బాలీవుడ్ లో చాందిని బార్, ఫ్యాషన్, హీరోయిన్, బబ్లీ బౌన్సర్ లాంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు తెరకెక్కించే స్టార్ డైరెక్టర్ మధుర్ భండార్కర్ ఇటీవల ‘ఇండియా లాక్‌డౌన్‌’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్ చేస్తున్న రీమేక్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మొదటి నుంచి కూడా కంటెంట్ ఓరియెంటెడ్ తో ఒరిజినల్ కథలతో సినిమాలను తెరకెక్కించారు మధుర్ భండార్కర్. తాజాగా మధుర్ భండార్కర్ రీమేక్ సినిమాల గురించి మాట్లాడుతూ.. ”ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమాలు ఓటీటీ ద్వారా ప్రేక్షకులకి మరింత చేరువయ్యాయి. వేరే భాషా సినిమాలని కూడా సబ్ టైటిల్స్ తో మన వాళ్ళు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో రీమేక్ సినిమాలు తీయకపోవడమే మంచింది. మన దర్శక నిర్మాతలు రీమేక్ సినిమాలు తీయడం మానేసి ఒరిజినల్ కథలపై దృష్టి పెట్టాలి” అని అన్నారు.

Lakshmi Bhupala : గుర్తుందా శీతాకాలం టైటిల్ ఎందుకు పెట్టారో తెలుసా??.. లవర్స్ కచ్చితంగా తెలుసుకోవాలి..

ఇటీవల బాలీవుడ్ లో వరుసగా రీమేక్ సినిమాలనే తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కువగా సౌత్ సినిమాలని తీసుకొని బాలీవుడ్ లో రీమేక్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మధుర్ భండార్కర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం బాలీవుడ్ లో చర్చగా మారాయి.