Yoga Anthem : దర్శకుడు మారుతి చేతుల మీదుగా ‘యోగా ఆంథెమ్’ సాంగ్ రిలీజ్..

ఇషాన్ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన యోగా ఆంథెమ్ సాంగ్ ను ప్రముఖ దర్శకులు మారుతి విడుద‌ల చేశారు.

Director Maruthi releases Yoga Anthem song

ఇషాన్ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన యోగా ఆంథెమ్ సాంగ్ ను ప్రముఖ దర్శకులు మారుతి విడుద‌ల చేశారు. అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించ‌గా మ‌ణిశ‌ర్మ కంపోజ్ చేశారు. హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో జ‌రిగిన ఈ కార్యక్రమంలో ఇషాన్ క్రియేషన్స్ అధినేత అశోక్, దర్శకులు మారుతి, లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు మారుతి మాట్లాడుతూ.. యోగా ఆంథెమ్ సాంగ్ ను త‌న చేతుల మీదుగా విడుద‌ల చేయ‌డం ఎంతో సంతోసంగా ఉంద‌న్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయాల‌న్నారు. అనంత శ్రీరామ్ అంద‌రికి అర్థ‌మ‌య్యేలా మంచి రిలిక్స్ రాశార‌ని, మ‌ణిశ‌ర్మ అద్భుతంగా కంపోజ్ చేశార‌ని కొనియాడారు. ఇషాన్ క్రియేషన్స్ అధినేత అశోక్ ఇలాంటి మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్న‌ట్లు తెలిపారు.

Sahakutumbaanaam : ఆక‌ట్టుకుంటున్న ‘స:కుటుంబానాం’ టీజర్..

లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. ఈ పాట‌ను అన్ని భాష‌ల వారికి అర్థం అయ్యేలా రాయాల‌ని అనుకున్నాను. అందుక‌నే ఎక్కువ‌గా సంస్కృత ప‌దాల‌ను ఉప‌యోగించి రాసిన‌ట్లు చెప్పుకొచ్చారు. ఈ పాట రూపకల్పన చేసి త‌న‌తో పాట రాయించాలని అశోక్ అనుకున్నందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

ఇషాన్ క్రియేషన్స్ అధినేత అశోక్ మాట్లాడుతూ .. తాను తెలుగు చిత్ర పరిశ్రమలో డిస్ట్రిబ్యూటర్ గా పలు సక్సెస్ ఫుల్ మూవీస్ డిస్ట్రిబ్యూట్ చేశాన‌ని, అప్ప‌టి నుంచే ద‌ర్శ‌కుడు మారుతి సపోర్ట్ ఉండేదన్నారు. కొన్ని చిత్రాల పంపీణి చేసి న‌ష్ట‌పోయాను. ఇండ‌స్ట్రీ నుంచి వెళ్లిపోదామ‌నుకునే స‌మ‌యంలో మారుతి పిలిచి త‌న‌కు మంచి రోజులు వ‌స్తాయ‌ని, వెయిట్ చేయాల‌ని సూచించారని చెప్పుకొచ్చారు.

Allu Arjun : అద్భుత‌మైన ఫోటోని షేర్ చేస్తూ.. త‌ల్లికి బ‌ర్త్ డే విషెస్ చెప్పిన అల్లు అర్జున్‌..

‘డిస్ట్రిబ్యూషన్ ఆపేశాక ఏడాదిపాటు రోజుకు 18 గంటలు యోగా ప్రాక్టీస్ చేశాను. 17 శక్తి పీఠాలు, 12 జ్యోతిర్లింగాలు దర్శించాను. ఈసారి యోగాంధ్ర సెలబ్రేషన్స్ లో మా యోగా ఆంథెమ్ సాంగ్ కు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఈపాటను మణిశర్మ అద్భుతంగా కంపోజ్ చేశారు, అనంత శ్రీరామ్ అందమైన లిరిక్స్ ఇచ్చారు. అనురాగ్ కులకర్ణి గారు ఆకట్టుకునేలా పాడారు. ఈ పాటకు నాకు ఏపీ ప్రభుత్వం లక్ష రూపాయల నగదు బహుమతి, ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు.’ అని అశోక్ అన్నారు.