Sahakutumbaanaam : ఆకట్టుకుంటున్న ‘స:కుటుంబానాం’ టీజర్..
రామ్ కిరణ్, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ స:కుటుంబానాం.

Sahakutumbaanaam Official Teaser out now
రామ్ కిరణ్, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ ‘స:కుటుంబానాం’. ఉదయ్ శర్మ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, సత్య, గిరి లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.
Allu Arjun : అద్భుతమైన ఫోటోని షేర్ చేస్తూ.. తల్లికి బర్త్ డే విషెస్ చెప్పిన అల్లు అర్జున్..
సత్య, బ్రహ్మానందం కామెడీ బాగుంది. మేఘా ఆకాష్ మంచి క్యారెక్టర్ చేసినట్లుగా తెలుస్తోంది. డైలాగ్స్, విజువల్స్ బాగున్నాయి. ఒక పక్క నుండి అర్జున్ రెడ్డి లాంటి వైబ్స్ కనిపిస్తూనే మరోపక్క కుటుంబ సమేతంగా చూసే చిత్రంగా కనిపిస్తోంది. రామ్ కిరణ్ నటన బాగుంది. మొత్తంగా టీజర్ ఆకట్టుకుంటోంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.