Director Maruthi said he would do movie with Chiranjeevi before Prabhas
Chiranjeevi : మెగాస్టార్ రీ-ఎంట్రీ తరువాత చాలామంది అభిమానులు.. చిరు నుంచి ఒక వింటేజ్ కామెడీ బ్యాక్‌డ్రాప్ మూవీని కోరుకుంటున్నారు. ఫ్యాన్స్ కోరుకుంటున్న ఈ కోరిక చిరంజీవి వరకు వెళ్ళింది. ఆయన కూడా అలాంటి ఓ సినిమా చేసేందుకు ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలోనే కొంతమంది దర్శకులు పేర్లు కూడా వినిపిస్తుంది. అలా వినిపించిన పేరులో ఒకటి దర్శకుడు మారుతీ.
మారుతీ స్క్రీన్ ప్లేకి చిరంజీవి కామెడీ టైమింగ్ సెట్ అయితే.. థియేటర్స్ లో కామెడీ కార్నివాల్ కావాల్సిందే. అయితే ఈ కాంబినేషన్ గత కొంతకాలంగా వార్తల్లో వినిపిస్తుంది తప్ప అధికారికంగా మాత్రం సెట్స్ పైకి రావడం లేదు. ప్రస్తుతం ఈ దర్శకుడు, ప్రభాస్‌తో ‘రాజాసాబ్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ తో ఈ సినిమా చేయడం కంటే ముందు చిరుతో మారుతీ ఓ సినిమా చేయాల్సి ఉందట.
Also read : హనుమంతుడిగా చిరంజీవి.. రాముడిగా మహేష్.. హనుమాన్ డైరెక్టర్ కామెంట్స్
ప్రభాస్ కంటే ముందు చిరుకి ఓ కథ కూడా వినిపించారట. చిరంజీవి వింటేజ్ కామెడీతో ఆ సినిమా కథ ఉంటుందట. మెగాస్టార్ నుంచి కూడా ఆ కథకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అయితే ఇంతలో ప్రభాస్ ‘రాజాసాబ్’ సినిమాకి ఓకే చెప్పడంతో.. చిరంజీవి సినిమాని పక్కన పెట్టి ప్రభాస్ సినిమాని పట్టాలు ఎక్కించాల్సి వచ్చిందట. ప్రభాస్ సినిమా పూర్తి అయిన తరువాత ఆ ప్రాజెక్ట్ మళ్ళీ పట్టాలు ఎక్కే ఛాన్స్ ఉంది.
I Planned a Movie with #Chiranjeevi if #RajaDeluxe Movie is Delayed – #Maruthi pic.twitter.com/zbxaawbfDd
— GetsCinema (@GetsCinema) January 29, 2024
కాగా చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు. వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం సోషియో ఫాంటసీ యాక్షన్ డ్రామాగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ మూవీ చిత్రీకణలో దాదాపు 70 శాతం షూటింగ్ VFX పైనే జరుపుకోనుంది. దీంతో ఈ ఏడాది అంతా చిరంజీవి ఈ మూవీ పైనే కమిట్ అయ్యి ఉండనున్నారు. ఈలోపు మారుతీ, ప్రభాస్ సినిమా షూటింగ్ కూడా పూర్తి అవుతుంది. మరి వచ్చే ఏడాది మారుతీ, చిరు సినిమా పట్టాలు ఎక్కుతుందా అనేది చూడాలి.