Director Maruthi
Director Maruthi : ఇటీవల్స్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ బాగా ఎక్కువైన సంగతి తెలిసిందే. మంచి విషయాలు, పక్కనోళ్ళ కష్టాలు, సక్సెస్ లను కూడా ట్రోల్ చేస్తూ నెగిటివిటితో శునకానందం పొందుతున్నారు కొంతమంది. ఇక సినిమాల్లో ఫ్యాన్ వార్స్ చేస్తూ పక్క హీరోలను, వేరే హీరోల సినిమాలను ట్రోల్ చేస్తూ ఆ సినిమాని చంపేస్తూ, సినిమా మీద హోప్స్ పెట్టుకున్నవాళ్ళందర్నీ బాధపెడుతున్నారు కొంతమంది ట్రోలర్స్. సోషల్ మీడియా సినీ మేధావులు జనాలకు సినిమా నచ్చినా దానిపై ట్రోల్స్ చేస్తున్నారు.(Director Maruthi)
డైరెక్టర్ మారుతీ ఇటీవలే ప్రభాస్ రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాపై కూడా బాగానే ట్రోల్స్ వస్తున్నాయి. సినిమా యావరేజ్ గా పర్వాలేదు అనిపించినా సినిమాలో తప్పులు వెతుకుతూ కొంతమంది పనిగట్టుకొని సినిమాని ట్రోల్ చేస్తున్నారు.
Also Read : Bhartha Mahasayulaku Wignyapthi : ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ రివ్యూ.. ఇరువురి భామల మధ్య నలిగిన రవితేజ..
డైరెక్టర్ మారుతీ ఈ ట్రోల్స్, నెగిటివిటి మీద స్పందించారు. మీడియాతో మాట్లాడిన మారుతి ట్రోల్స్ మీద స్పందిస్తూ.. ట్రోల్స్ చేస్తే ఏమొస్తుంది. పక్కనోడి కష్టం మీద ట్రోల్స్ వేసి ఆ సమయానికి నవ్వుకుంటారు అంతే. మీరు వేసే ట్రోల్స్ వల్ల ఎంతమంది బాధపడతారో తెలుసా. సినిమా మీకు నచ్చకపోతే సైలెంట్ గా వదిలేయండి. కష్టపడి తీసిన సినిమాని నెగిటివ్ చేసి ఆ సినిమాకు పనిచేసిన వాళ్ళందర్నీ, ఆ సినిమా మీద డబ్బులు పెట్టినవాళ్ళందర్నీ బాధ పెడుతున్నారు.
ట్రోల్స్ చేసే వాళ్ళు ఏదో ఒకరోజు బాధపడతారు. కర్మ వదిలిపెట్టదు. ఏదో ఒక రోజు ఒక్కరే కూర్చొని అనవసరంగా ట్రోల్స్ చేశాను అని ఏడుస్తారు. అందుకే నేను ఆ ట్రోల్స్ చూసి నవ్వి వదిలేస్తాను. ఏదో ఒకరోజు వాళ్లకు తిరిగొస్తుంది. ఇది నా శాపం కాదు కానీ ఇదే జరుగుతుంది అని అన్నారు. దీంతో మారుతి వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Also Read : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ సినిమా చూసి డిజప్పాయింట్ అయ్యాను.. బిగ్ బాస్ పృథ్వీ కామెంట్స్ వైరల్..