Vijay Deverakonda : విజయ్ దేవరకొండ సినిమా చూసి డిజప్పాయింట్ అయ్యాను.. బిగ్ బాస్ పృథ్వీ కామెంట్స్ వైరల్..
తాజాగా విజయ్ సినిమాపై సీరియల్ నటుడు, బిగ్ బాస్ ఫేమ్ పృథ్వీ రాజ్ శెట్టి ఆసక్తికర కామెంట్స్ చేసాడు.(Vijay Deverakonda)
Vijay Deverakonda
Vijay Deverakonda : అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో ఒక్కసారిగా స్టార్ డమ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ మళ్ళీ ఆ రేంజ్ హిట్ సినిమా సాధించలేదు. హిట్ కొట్టాలని చాలా కష్టపడుతున్నాడు విజయ్. కానీ విజయ్ సినిమాలతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఇటీవల రిలీజయిన కింగ్డమ్ సినిమా కూడా యావరేజ్ గా నిలిచింది. తాజాగా విజయ్ కింగ్డమ్ సినిమాపై సీరియల్ నటుడు, బిగ్ బాస్ ఫేమ్ పృథ్వీ రాజ్ శెట్టి ఆసక్తికర కామెంట్స్ చేసాడు.(Vijay Deverakonda)
ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన పృథ్వీ రాజ్ శెట్టిని రీసెంట్ టైంలో ఏదైనా సినిమా చూసి డిజప్పాయింట్ అయ్యారా అని అడిగారు.
Also Read : Prithviraj Shetty : నాన్న చిన్నప్పుడే చనిపోయారు.. డబ్బులు లేకుండా.. బిగ్ బాస్ పృథ్వీ శెట్టి ఎమోషనల్..
దీనికి పృథ్వీ రాజా శెట్టి సమాధానమిస్తూ.. కింగ్డమ్ సినిమా చూసి నేను డిజప్పాయయింట్ అయ్యాను. విజయ్ దేవరకొండ అంటే నాకు ఇష్టం. అతనికి సక్సెస్ రావాలని కోరుకున్నాను. కింగ్డమ్ సినిమాకు ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళాను. ఇన్‌స్టాగ్రామ్ లో స్టోరీ కూడా పెట్టాను. ఈ సినిమాతో హిట్ కొట్టాలి అనుకున్నాను. కానీ ఆ సినిమా అంతగా నచ్చలేదు. డిజప్పాయింట్ అయ్యాను. భవిష్యత్తులో విజయ్ తో నటించే అవకాశం వస్తే కచ్చితంగా చేస్తాను అని తెలిపాడు.
Also See : Sanjana Galrani : కూతురితో బిగ్ బాస్ సంజన.. టీవీ షోలో సందడి.. ఫొటోలు వైరల్..
