Director Mysskin Sensational Comments on Actress Purnaa
Mysskin – Purnaa : తెలుగులో ఒకప్పుడు హీరోయిన్ గా మెప్పించిన పూర్ణ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, గెస్ట్ అప్పీరెన్స్ లతో సినిమాలు చేస్తూ అప్పుడప్పుడు టీవీ షోలలో కనిపిస్తుంది. ఇటీవలే గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతబెట్టి సాంగ్ లో కనపడి అలరించింది. ఓ పక్క సినిమాల్లో పాత్రలు చేస్తూనే మరో పక్క భర్త, కొడుకుతో హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ గడుపుతుంది పూర్ణ.
పూర్ణ ముఖ్య పాత్రలో నటించిన డెవిల్(Devil) అనే తమిళ సినిమా ఫిబ్రవరి 2న రిలీజ్ కానుంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మిస్కిన్ తమ్ముడు ఆదిత్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకి మిస్కిన్ సంగీతం అందించాడు. దీంతో తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా ప్రమోషన్స్ లో మిస్కిన్ కూడా పాల్గొన్నారు.
ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మిస్కిన్ మాట్లాడుతూ.. ఈ సినిమా నా తమ్ముడి సినిమా అని ప్రమోట్ చేస్తున్నా అంటున్నారు. అది నాకు చాలా బాధ కలిగించింది. మంచి సినిమా ఎవరిదైనా నేను ప్రమోట్ చేస్తాను. ఈ సినిమా చేసే సమయంలో నాకు పూర్ణకు మధ్య సంబంధం అంటగడుతూ కొంతమంది రాశారు. అవి చూసి చాలా బాధపడ్డాను. పూర్ణకు నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. పూర్ణ నాకు తల్లిలాంటింది. కుదిరితే వచ్చే జన్మలో పూర్ణకి బిడ్డగా పుట్టాలనుకుంటాను అని అన్నారు. దీంతో స్టేజి మీద ఉన్న పూర్ణ ఈ మాటలకు ఎమోషనల్ అయింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తమిళ పరిశ్రమలో వైరల్ గా మారాయి.