Sobhita Dhulipala : హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న తెలుగు భామ.. ‘హనుమాన్’ రిఫరెన్స్ సినిమాలో..

భారత సంతతి బ్రిటిష్ యాక్టర్ దేవ్ పటేల్ హాలీవుడ్ లో అనేక సినిమాల్లో నటించాడు. మొదటిసారి దర్శకుడిగా మారి హీరోగా తానే నటిస్తూ మంకీ మ్యాన్ అనే సినిమాని తీసాడు. ఈ సినిమాలో శోభిత హీరోయిన్ గా నటిస్తుంది.

Sobhita Dhulipala : హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న తెలుగు భామ.. ‘హనుమాన్’ రిఫరెన్స్ సినిమాలో..

Sobhita Dhulipala entry in Hollywood with Dev Patel Monkey Man Movie

Updated On : January 28, 2024 / 8:32 AM IST

Sobhita Dhulipala – Monkey Man : మన తెలుగు అమ్మాయి, తెనాలి అమ్మాయి శోభిత ధూళిపాళ ప్రస్తుతం అన్ని సినిమా పరిశ్రమలలోని వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ్ లో సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లో బిజీ అయింది. బోల్డ్ పాత్రలకు కూడా ఓకే చెప్పడంతో బాలీవుడ్ లో సినిమాలు, సిరీస్ లు ఆఫర్స్ బాగా వస్తున్నాయి. వరుస సినిమాలు, సిరీస్ లు చేస్తూ ఫాలోవర్స్ ని కూడా పెంచుకుంటుంది శోభిత. ఇప్పుడు ఈ తెలుగమ్మాయి హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది.

స్లమ్ డాగ్ మిలినియర్ సినిమాతో ఇండియన్ ప్రేక్షకులకు పరిచయమైన భారత సంతతి బ్రిటిష్ యాక్టర్ దేవ్ పటేల్(Dev Patel) హాలీవుడ్ లో అనేక సినిమాల్లో నటించాడు. మొదటిసారి దర్శకుడిగా మారి హీరోగా తానే నటిస్తూ మంకీ మ్యాన్ అనే సినిమాని తీసాడు. ఈ సినిమాలో శోభిత హీరోయిన్ గా నటిస్తుంది. మంకీ మ్యాన్ సినిమా ఏప్రిల్ 5న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.

దేవ్ పటేల్ భారత సంతతికి చెందిన వ్యక్తి కావడంతో సినిమా అంతా ఇండియన్ రిఫరెన్స్ చాలానే కనిపిస్తుంది. అలాగే రామాయణం, హనుమంతుడి రిఫరెన్స్ కనిపిస్తుంది. హనుమంతుడిని స్ఫూర్తిగా తీసుకొని హీరో మంకీ మ్యాన్ గా మారి తనకి వచ్చిన కష్టాలని ఎలా ఎదుర్కున్నాడు అనే కథాంశంతో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. దీంతో ఈ మంకీ మ్యాన్ ట్రైలర్ ఇండియాలో కూడా వైరల్ అవుతువుంది. ఈ సినిమా ఇండియాలో కూడా రిలీజవ్వనుంది. ఇప్పట్నుంచే ఈ సినిమాపై ఇండియన్ ప్రేక్షకులకు ఆసక్తి నెలకొంది.

https://www.youtube.com/watch?v=g8zxiB5Qhsc

Also Read : Bobby Deol : సౌత్‌లో దూసుకొస్తున్న మరో బాలీవుడ్ హీరో.. సౌత్ ఇండస్ట్రీకి మరో కొత్త విలన్ దొరికాడు..

ఇక ఈ సినిమా ట్రైలర్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. నా మొదటి హాలీవుడ్ సినిమా ఇది. ట్రైలర్ రిలీజయినందుకు చాలా సంతోషంగా ఉంది అని పోస్ట్ చేసింది శోభిత ధూళిపాళ. దీంతో తెలుగమ్మాయి హాలీవుడ్ డెబ్యూట్ ఇస్తుండటంతో పలువురు కంగ్రాట్స్ చెప్తున్నారు.