Bobby Deol : సౌత్‌లో దూసుకొస్తున్న మరో బాలీవుడ్ హీరో.. సౌత్ ఇండస్ట్రీకి మరో కొత్త విలన్ దొరికాడు..

బాలీవుడ్ అంతా సౌత్ సినిమాలు కోసం పరిగెడుతున్న బాటలోనే బాబీ డియోల్ కూడా సౌత్ సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.

Bobby Deol : సౌత్‌లో దూసుకొస్తున్న మరో బాలీవుడ్ హీరో.. సౌత్ ఇండస్ట్రీకి మరో కొత్త విలన్ దొరికాడు..

Bollywood Star Animal Fame Bobby Deol Busy with South Movies Kanguva NBK 109 and others

Updated On : January 28, 2024 / 7:52 AM IST

Bobby Deol : సౌత్ సినిమా స్థాయి పెరిగాక బాలీవుడ్(Bollywood) ఆర్టిస్టులంతా సౌత్ సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అనేకమంది బాలీవుడ్ స్టార్స్ సౌత్ సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ లు, ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్స్ నటిస్తున్నారు. ఇక కొంతమంది హీరోలు అయితే సౌత్ లో విలన్ గా కూడా నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే సంజయ్ దత్, సైఫ్ అలీఖాన్ తెలుగు సినిమాల్లో విలన్ గా నటిస్తున్నారు. ఇప్పుడు మరో బాలీవుడ్ హీరో సౌత్ సినిమాల్లో విలన్ గా బిజీ అవ్వబోతున్నారు.

ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోగా నటించిన బాబీ డియోల్ బాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగి అనంతరం విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తున్నారు. ఇటీవల యానిమల్(Animal) సినిమాలో చివర్లో విలన్ గా కనిపించి తన నటనతో అదరగొట్టేసాడు. అందర్నీ మెప్పించాడు. యానిమల్ సినిమాతో సౌత్ ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు బాబీ డియోల్. అయితే బాబీ డియోల్ ఆల్రెడీ పవన్ హరిహర వీరమల్లు సినిమాతోనే మన తెలుగు ప్రేక్షకులని పలకరించాలి. కానీ ఆ సినిమా పవన్ బిజీ షెడ్యూల్స్ వల్ల లేట్ అవుతుండటంతో యానిమల్ ముందు వచ్చేసింది.

తాజాగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలకృష్ణ 109వ సినిమాలో బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నట్టు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. తెలుగులో ఇప్పుడు బాలయ్య సినిమా, హరిహరవీరమల్లు సినిమాలు బాబీ డియోల్ చేతిలో ఉన్నాయి. ఇక తమిళ్ లో సూర్య హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టు కంగువ సినిమాలో కూడా బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. నిన్న బాబీ డియోల్ పుట్టిన రోజు కావడంతో కంగువ నుంచి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.

Also Read : Dheera Trailer : ‘ధీర’ ట్రైలర్ చూశారా? 25 లక్షల నుంచి 2500 కోట్ల వరకు జర్నీ..

ఆల్రెడీ యానిమల్ సినిమాతోనే మెప్పించి సౌత్ లో విలన్ గా ఆఫర్స్ తెచ్చుకుంటున్నాడు బాబీ డియోల్. ఇప్పుడు బాలయ్య సినిమా, కంగువ(Kanguva) సినిమాలు రిలీజయితే సౌత్ లో బాబీ డియోల్ మరిన్ని సినిమాల్లో విలన్ గా బిజీ అవుతాడు. గత ముప్పై ఏళ్లుగా బాబీ డియోల్ సినిమాలో చేస్తున్నాడు. ప్రత్యేకంగా అతని నటన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ బాలీవుడ్ అంతా సౌత్ సినిమాలు కోసం పరిగెడుతున్న బాటలోనే బాబీ డియోల్ కూడా సౌత్ సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. మొత్తానికి తెలుగు, సౌత్ ఇండస్ట్రీకి మరో కొత్త విలన్ దొరికేసాడు.