×
Ad

Jailer 2: జైలర్ 2 కోసం సూపర్ స్కెచ్.. స్టార్స్ తో నింపేస్తున్న నెల్సన్.. ఎంతమందో తెలుసా?

సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అంటే జైలర్ అనే చెప్పాలి. దర్శకుడు నెల్సన్ తెరకెక్కించిన (Jailer 2)ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కేవలం రజినీకాంత్ స్టామినాపై నడిచిన ఈ సినిమా ఏకంగా రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

Director Nelson Kumar is planning cameos with star heroes in the movie Jailer 2

Jailer 2: సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అంటే జైలర్ అనే చెప్పాలి. దర్శకుడు నెల్సన్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కేవలం రజినీకాంత్ స్టామినాపై నడిచిన ఈ సినిమా ఏకంగా రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కథ పాతదే అయినా దాన్ని డైరెక్టర్ నెల్సన్ ప్రెజెంట్ చేసిన విధానానికి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఇక కథలోఎలివేషన్స్ కి తగ్గట్టుగా అనిరుధ్ అందించిన మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా(Jailer 2) తక్కువే. రజినీకాంత్ రేంజ్ తగ్గ మ్యూజిక్ తో సినిమాను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాడు అనిరుధ్.

Rajasaab: ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. సంక్రాంతి రేస్ నుంచి రాజాసాబ్ అవుట్? .. ఇంకా ఎన్నిసార్లు..

అంతేకాదు, ఈ సినిమాలో నెల్సన్ కుమార్ సెట్ చేసిన క్యామియోస్ కూడా నెక్స్ట్ లెవల్లో వర్కౌట్ అయ్యాయి. మోహన్ లాల్, శివరాక్ కుమార్, జాకీ ష్రాఫ్ లాంటి స్టార్స్ ని దించి ఆడియన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు. ఈ సీన్స్ కి కూడా ఆడియన్స్ ఒక రేంజ్ లో ఎంటర్టైన్ అయ్యారు. ఇక జైలర్ సినిమాకు సీక్వెల్ గా జైలర్ 2 సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలయ్యింది. తాజాగా ఈ సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే, జైలర్ 2 కోసం కూడా అదిరిపోయే క్యామియోలను సెట్ చేశాడట నెల్సన్. అందుకోసం స్టార్స్ ని దించుతున్నాడట.

ఆ స్టార్స్ లో ముందుగా చెప్పుకోవాల్సింది టాలీవుడ్ నుంచి నందమూరి బాలకృష్ణ. ఈ క్యామియో సినిమాకి హైలెట్ గా నిలువనుందట. రజినీకాంత్, బాలకృష్ణ మధ్య వచ్చే సీన్స్ కి ఆడియన్స్ ఒక రేంజ్ లో ఎంటర్టైన్ అవుతారట. ఇంకా బాలీవుడ్ నుంచి మిధున్ చక్రవర్తి, మోలీవుడ్ నుంచి ఫహాద్ ఫజిల్, స్టార్ బ్యూటీ విద్యాబాలన్, సూరజ్ వెంజరమూడు లాంటి స్టార్స్ ఈ సినిమాలో కనిపించబోతున్నారట. దీంతో ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకుంటున్నాయి. కేవలం మూడు మ్యానియాలతో ఒక రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన నెల్సన్ ఈసారి ఇంతమందిని దింపుతున్నాడు అంటే ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు.