Ravi Babu: మన హీరోలంతా డూప్ రాజాలే.. కానీ నేనలా కాదు.. స్టార్ హీరోలను టార్గెట్ చేసిన డైరెక్టర్ రవిబాబు
Ravi Babu Latest Interview: టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన దర్శకుడు రవి బాబు(Ravi Babu).
Director Ravi Babu shocking comments about Tollywood heroes using body doubles.
- పాన్ ఇండియా హీరోలపై సెన్సేషనల్ కామెంట్స్.
- డూప్స్ లేకుండా రవిబాబు ఫైట్స్.
- వచ్చే నెలలో ‘రేజర్’ విడుదల.
Ravi Babu: తెలుగు సినీ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా, దర్శకుడిగా రవిబాబుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన హారర్, కామెడీ, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఇలా ఏ జానర్ ఎంచుకున్నా అందులో తనదైన ముద్ర ఉండేలా జాగ్రత్తపడతారు. వైవిధ్యమైన కథాంశాలతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడం వల్లే ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ఏర్పడింది. గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉన్న రవిబాబు, ఇప్పుడు ‘రేజర్’ అనే వినూత్న చిత్రంతో తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది.
*ఘనంగా జరిగిన టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి
వచ్చే నెల 8వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో రవిబాబు(Ravibabu) వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో పాన్ ఇండియా హీరోల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రెజెంట్ ఉన్న హీరోలలో దాదాపు 90 శాతం మంది పాన్ ఇండియా స్టార్లు యాక్షన్ సీన్ల కోసం డూప్స్‌పైనే ఆధారపడుతున్నారని ఆయన సంచలన విమర్శలు చేశారు. హీరోలు తామే స్వయంగా ఫైట్స్ చేస్తున్నట్లు కలరింగ్ ఇస్తారని, కానీ తెర వెనుక అసలు విషయం వేరేలా ఉంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
తన తాజా చిత్రం ‘రేజర్’ గురించి మాట్లాడుతూ, ఇందులో హీరో పాత్ర శారీరకంగా చాలా దృఢంగా ఉండాలని, ఆ వయస్సుకి తగ్గట్టుగా నటించే నటుడు ఎవరూ దొరకకపోవడంతో తానే ప్రధాన పాత్ర పోషించాల్సి వచ్చిందని వెల్లడించారు. ఈ సినిమాలో కనిపించే రిస్కీ ఫైట్స్, యాక్షన్ సన్నివేశాలన్నింటినీ డూప్‌ను వాడకుండా తానే స్వయంగా పూర్తి చేశానని రవిబాబు స్పష్టం చేశారు. ఇది నా డెడికేషన్‌కు నిదర్శనమని, ప్రేక్షకులకు ఈ సినిమా ఒక గొప్ప థ్రిల్లింగ్ అనుభవాన్ని ఇస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరి రేజర్ సినిమా రవిబాబుకి మంచి కంబ్యాక్ అవుతుందా అనేది చూడాలి.
