Director RGV Special Post on Bigg Boss Contestant Soniya to Support her
Soniya – RGV : తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 సాగుతున్న సంగతి తెలిసిందే. మూడు వారాలు ముగ్గురు కంటెస్టెంట్స్ వెళ్లిపోగా ప్రస్తుతం నాలుగో వారం సాగుతుంది. అయితే ఈ సారి సోనియా వెళ్ళిపోతుందని పలువురు బిగ్ బాస్ ఆడియన్స్ భావిస్తున్నారు. ఈ క్రమంలో సోనియాకు సపోర్ట్ గా డైరెక్టర్ ఆర్జీవీ పోస్ట్ పెట్టడం గమనార్హం.
ప్రతి సీజన్ లోను ఆర్జీవీ కాంపౌండ్ నుంచి ఎవరో ఒకరు బిగ్ బాస్ కి వెళ్తారు. అలా ఈ సారి సోనియా వెళ్ళింది. సోనియా ఆర్జీవీ నిర్మాణంలో నటిగా కరోనా, ఆశ.. పలు సినిమాలు చేసింది. సోనియా గతంలో ఆర్జీవీతో కలిసి దిగిన ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. అలా ఆర్జీవీ ట్యాగ్ తో సోనియా లోపలికి వెళ్లడంతో ఆర్జీవీ ఫ్యాన్స్ నుంచి కూడా ఆమెకు సపోర్ట్ వచ్చింది.
Also Read : Game Changer Update : అదిరిపోయిన ‘గేమ్ ఛేంజర్’ అప్డేట్.. రెండో పాట గురించే..
ఇప్పుడు ఆర్జీవీ తన సోషల్ మీడియాలో సోనియాతో దిగిన ఫోటో షేర్ చేస్తూ.. యాటిట్యూడ్ కి, ధైర్యానికి నిదర్శనం అయిన సోనియా బిగ్ బాస్ లో బాగా ఆడుతుంది. మీరు కూడా ఆమెకు సపోర్ట్ చేసి ఆమెకు ఓట్లు వేయాలని పోస్ట్ చేసాడు. మరి ఆర్జీవీ సపోర్ట్ కలిసొచ్చి సోనియా ఎక్కువ రోజులు హౌస్ లో ఉంటుందా చూడాలి.