Game Changer Update : అదిరిపోయిన ‘గేమ్ ఛేంజర్’ అప్డేట్.. రెండో పాట గురించే..

తాజాగా నేడు గేమ్ ఛేంజర్ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

Game Changer Update : అదిరిపోయిన ‘గేమ్ ఛేంజర్’ అప్డేట్.. రెండో పాట గురించే..

Ram Charan Game Changer Movie Second Song Update

Updated On : September 25, 2024 / 9:14 AM IST

Game Changer Update : మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మూడేళ్ళుగా ఈ సినిమా సాగుతున్నా ఒక సాంగ్, ఒక పోస్టర్ తప్ప ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో ఇన్నాళ్లు ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఇటీవల ఈ సినిమాని క్రిస్మస్ కి రిలీజ్ చేస్తామని దిల్ రాజు ప్రకటించారు. అప్పట్నుంచి గేమ్ ఛేంజర్ గురించి గట్టిగానే వినిపిస్తుంది.

ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కొన్ని రోజుల నుంచి వరుసగా గేమ్ ఛేంజర్ అప్డేట్స్ అంటూ హడావిడి చేస్తుండటంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేసారు. తాజాగా నేడు గేమ్ ఛేంజర్ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. సినిమాలోని రెండో పాట రా మచ్చా మచ్చా.. అంటూ సాగుతుందని చెప్తూ త్వరలోనే ఈ పాట రిలీజ్ కానుందని తెలిపారు. రెండో పాట వచ్చే సమయం అయింది. బ్లాస్ట్ కి సిద్ధంగా ఉండండి అంటూ పోస్ట్ చేసారు మూవీ యూనిట్.

Image

గేమ్ ఛేంజర్ ఫస్ట్ సాంగ్ జరగనుంది ఇప్పటికే సూపర్ హిట్ అయింది. మరి రెండు పాట రా మచ్చా ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.