Sagar K Chandra : పంజా ఆడియో ఫంక్షన్ కి లోపలి కూడా వెళ్ళలేకపోయాను.. కాని ఇవాళ..
డైరెక్టర్ సాగర్ కే చంద్ర మాట్లాడుతూ.. ''మా నాన్న గారికి చాలా థ్యాంక్స్. ఇన్ని రోజులు నన్ను సపోర్ట్ చేసిన నా ఫ్యామిలీకి థ్యాంక్స్. 2011లో పంజా ఆడియో ఫంక్షన్ లో పాస్ ఉన్నా లోపలికి...

Sagar
Bheemla Nayak : పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ ‘భీమ్లా నాయక్’. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ లు హీరోయిన్లుగా నటించారు. ‘భీమ్లా నాయక్’ సినిమాకి త్రివిక్రమ్ మాటలు రాయగా, సాగర్ కే చంద్ర దర్శకత్వలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమా ఫిబ్రవరి 25న రిలీజ్ అవ్వనుంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్లతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిబ్రవరి 23న బుధవారం సాయంత్రం హైదరాబాద్ యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో జరిగింది.
డైరెక్టర్ సాగర్ కే చంద్ర మాట్లాడుతూ.. ”మా నాన్న గారికి చాలా థ్యాంక్స్. ఇన్ని రోజులు నన్ను సపోర్ట్ చేసిన నా ఫ్యామిలీకి థ్యాంక్స్. 2011లో పంజా ఆడియో ఫంక్షన్ లో పాస్ ఉన్నా లోపలికి వెళ్ళడానికి ట్రై చేసినా వెళ్ళలేకపోయాను. కానీ ఇప్పుడు స్టేజి మీద పవన్ కళ్యాణ్ గారి పక్కన నిల్చొని మాట్లాడుతున్నాను. నా చుట్టూ ఉన్న మంచి వాళ్ళ వల్లే సాధ్యం. రానా గారు ఫుల్ ఎనర్జీగా ఉంటారు. నేను ఎవరిగారిలా అయినా బతకాలి అంటే రానా గారిలా ఉండాలి అనుకుంటున్నాను. ఈ సినిమాకి పని చేసిన టెక్నిషియన్స్ అందరికి చాలా థ్యాంక్స్. త్రివిక్రమ్ గారి దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. నా హృదయంలో మీకు ఆ టీచర్ స్థానం ఎప్పుడు ఉంటుంది. పవన్ గారిని చూసి షేక్ హ్యాండ్ ఇస్తే చాలు అనుకునే నుంచి ఇక్కడిదాకా వచ్చా.” అని తెలిపారు.
Talasani Srinivas Yadav : సినిమా వాళ్ళు ఏం అడిగినా చేస్తున్నాం
చివరగా పవన్ కళ్యాణ్ గురించి చెప్తూ.. ”గెలుపంటే మోజు లేదు.. ఓటమి అంటే భయం లేదు.. చావు అంతం కాదన్నపుడు చావుకి ఎందుకు భయం.. వెళ్లి ఆకాశం లోంచి గర్జించు” అని పవన్ కళ్యాణ్ ని చూసి నేర్చుకున్నాను అని తెలిపారు.