Baby Movie : హిందీలో బేబీ రీమేక్.. నటీనటులు కావాలని పోస్ట్..
బేబీ సినిమాతో ఊహించని విజయాన్ని అందుకున్న డైరెక్టర్ సాయి రాజేష్ ఇప్పుడు బేబీ సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారు.

Director Sai Rajesh is remaking Baby movie in Hindi
Baby Movie : ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్, నేషనల్ అవార్డు విన్నర్ సాయి రాజేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బేబీ సినిమాతో ఊహించని విజయాన్ని అందుకున్న ఈ డైరెక్టర్ ఇప్పుడు బేబీ సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారు.అయితే తెలుగులో భారీ విజయాన్న అందుకున్న బేబీ సినిమా హిందీ రీమేక్ కోసం నటీనటులు కావాలని ఓ వీడియో పెట్టారు. బాలీవుడ్ కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ ఛబ్రా తో లింకప్ అయ్యి ఈ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాను పలు స్టార్ నటీనటుల పిల్లలతో చేద్దామని అనుకున్నారట. అంతేకాదు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ సోదరి, ఖుషీ కపూర్ తో చేద్దామని కూడా ప్లాన్ చేశారట. కానీ ఇప్పుడు సరికొత్త నటులు కావాలని పేర్కొన్నారు.
Also Read : Pushpa 3 : బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ.. పుష్ప 3 టైటిల్ కూడా ఫిక్స్.. ఏంటంటే..
ప్రముఖ బాలీవుడ్ కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ ఛబ్రా ఈ వీడియో చేశారు. అందులో ఆయన మాట్లాడారు..” మీకు కూడా సినీ ఇండస్ట్రీ కి రావాలనుందా.. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ కి రావాలనుకుంటున్న వారికి బాలీవుడ్ మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. మేము ఒక సరికొత్త లవ్ స్టోరీ సినిమా చేయబోతున్నాం. దానికోసం 18-23 సంవత్సరాలలోపు గల అమ్మాయిలు కావలి. మీ కలర్ తో సంబంధం లేదు. ఏ కలర్ ఉన్నా ఇండియాలో ఏ మూలన ఉన్నా పర్లేదు. మాకు వాటితో అవసరంలేదు. రియల్ గా ఉండి మీలో యూనిక్ స్టయిల్ ఉంటే చాలు అని చెప్పుకొచ్చారు.
View this post on Instagram
సాయి రాజేష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను అల్లు అరవింద్, SKN కలిసి సంయుక్తంగా చేస్తున్నారు. ఈ సినిమాలో మీరు కూడా భాగం కావాలంటే ఎటువంటి మేకప్ లేకుండా నేచురల్ గా ఒక 2 నిమిషాల వీడియో పంపండని ఒక ఇమెయిల్ ఐడి పెట్టారు. దీంతో ఆ వీడియో వైరల్ అవుతుంది. మరి ఇందులో ఎవరు నటిస్తారు అన్నది తెలియాల్సి ఉంది. తెలుగులో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించారు. తెలుగులో భారీ విజయాన్ని అందుకున్న బేబీ సినిమా బాలీవుడ్ లో కూడా సక్సెస్ అవుతుందా లేదా చూడాలి.