Pushpa 3 : బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ.. పుష్ప 3 టైటిల్ కూడా ఫిక్స్.. ఏంటంటే..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప పార్ట్ 1 ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Allu Arjun Pushpa 3 movie title update goes viral
Pushpa 3 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప పార్ట్ 1 ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పార్ట్ వన్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో దీనికి సీక్వెల్ గా ఇప్పుడు పార్ట్ 2 తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ నెక్స్ట్ లెవెల్ లో చేస్తున్నారు. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా చేసారు.
Also Read : Singer Pranavi : ‘ప్రెగ్నెన్సీలో నా గొంతు పోయింది.. కనీసం పాపకి కూడా’.. సింగర్ ప్రణవి వ్యాఖ్యలు
అయితే పార్ట్ 2 తో పాటు పార్ట్ 3 కూడా ఉండబోతుందని ఇప్పటికే సుకుమార్, రష్మిక, అల్లు అర్జున్ అందరూ హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఫైనల్ సౌండ్ మిక్సింగ్ రూమ్ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ఆస్కార్ విన్నర్ రెసూల్ పూకుట్టి పుష్ప 2 సినిమాకి సౌండ్ మిక్సింగ్ చేశారు. తాజాగా పుష్ప 2 సౌండ్ మిక్సింగ్ పూర్తి చేసారు. ఆ సందర్బంగా ఈ ఫోటో దిగారు. ఇక ఆ ఫోటో బ్యాగ్రౌండ్ లో స్క్రీన్ పై ‘పుష్ప 3 ది ర్యాంపేజ్’ అనే టైటిల్ ఉంది. దీన్నిబట్టి చూస్తే పుష్ప 2 క్లైమాక్స్‌లో పుష్ప 3 మూవీకి సంబంధించిన లీడ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఇప్పటికే పుష్ప 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే.. నిన్న జరిగిన పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సుకుమార్ సైతం దీనిపై ఓ కామెంట్ చేశాడు. బన్నీ మరో మూడేళ్లు సమయాన్ని ఇస్తే.. పుష్ప 3 కూడా చేస్తానని అన్నారు. పుష్ప 1 సమయంలో కూడా ఎండింగ్ లో పార్ట్ 2 గురించి రివీల్ చేసారు. ఇప్పుడు 3 కూడా అలానే చేస్తారన్న వార్తలు వినబడుతున్నాయి.