Sailesh Kolanu : నెగిటివ్ రివ్యూలు ఆపలేవు.. రెండ్రోజులే అయింది.. వెయిట్ చేయండి.. ‘సైంధవ్’ సినిమాపై డైరెక్టర్ ట్వీట్..

తాజాగా సైంధవ్ సినిమాకి వచ్చే మిక్స్‌డ్ రివ్యూలపై డైరెక్టర్ శైలేష్ కొలను తన ట్విట్టర్ ద్వారా స్పందించాడు.

Sailesh Kolanu : నెగిటివ్ రివ్యూలు ఆపలేవు.. రెండ్రోజులే అయింది.. వెయిట్ చేయండి.. ‘సైంధవ్’ సినిమాపై డైరెక్టర్ ట్వీట్..

Director Sailesh Kolani Reacts on Saindhav Movie Mixed Talks

Updated On : January 15, 2024 / 9:54 AM IST

Sailesh Kolanu : శైలేష్‌ కొలను దర్శకత్వంలో విక్ట‌రీ వెంకటేశ్(Venkatesh) 75వ సినిమాగా ఈ సంక్రాంతికి ‘సైంధవ్‌’(Saindhav) సినిమా వచ్చింది. టీజర్, ట్రైలర్స్, సాంగ్స్ తో ముందు నుంచి ఈ సినిమా ఎమోషనల్, యాక్షన్ సీక్వెన్స్ లతో ఉంటుందని అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, తమిళ్ నటుడు ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, బేబీ సారా.. తదితరులు నటించారు.

సైంధవ్‌ సినిమా.. కూతుర్ని బతికించుకోవడానికి హీరో పడే బాధ, ప్రయత్నంతో పాటు హీరో గతం తాలూకు వెంటాడుతున్న విలన్స్ యాక్షన్ సీన్స్ తో నడుస్తుంది. అయితే ఈ సినిమాకి మిక్స్‌డ్ టాక్స్ వచ్చాయి. దీంట్లో అసలు ఎంటర్టైన్మెంట్ ఏమి లేకపోవడం, సంక్రాంతికి వచ్చిన మిగిలిన మూడు సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ ఉండటం, సైంధవ్‌ లో కేవలం ఎమోషన్, యాక్షన్ సీన్స్ ఉండటం, పండగ సీజన్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా కొంచెం దూరం అనిపించడంతో వెంకిమామ సైంధవ్‌ కి మిక్స్‌డ్ రివ్యూలు వస్తున్నాయి. ఒక వేళ సినిమా బాగున్నా సైంధవ్‌ సినిమా ఈ టైంలో వచ్చేది కాదు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. నాలుగు సినిమాలు ఉండటం, సినిమాకి మిక్స్‌డ్ టాక్ రావడంతో కలెక్షన్స్ కూడా అంతంతమాత్రమే ఉన్నాయి.

Also Read : Hanuman : ‘హనుమాన్’ టీంపై సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారాలు చేస్తున్నారు.. సంచలన పోస్ట్ చేసిన డైరెక్టర్..

తాజాగా ఈ సినిమాకి వచ్చే మిక్స్‌డ్ రివ్యూలపై డైరెక్టర్ శైలేష్ కొలను తన ట్విట్టర్ ద్వారా స్పందించాడు. శైలేష్ కొలను తన ట్వీట్ లో.. వెంకిమామ సైంధవ్‌ రిలీజ్ అయిన రెండో రోజు థియేటర్స్ ని సందర్శించారు. మంచి రివ్యూ బాగోలేని సినిమాని కాపాడలేదు. అలాగే బ్యాడ్ రివ్యూ మంచి సినిమాని డ్యామేజ్ చేయలేదు. ఒక మంచి సినిమాకు ఆడియన్స్ వస్తారు. నాకు మౌత్ టాక్ మీద నమ్మకం ఉంది. సంక్రాంతి సినిమాలు ఇంకా ఉన్నా సైంధవ్‌ కి కూడా ఆడియన్స్ వస్తున్నారు. ఈ సంక్రాంతికి మేము ఆడియన్స్ కి కొత్తగా ఓ సినిమాని తీసుకొచ్చాం. సైంధవ్‌ సినిమాని చాలామంది థియేటర్స్ కి వచ్చి చూస్తున్నారు. సైంధవ్‌ వచ్చి కేవలం రెండు రోజులే అయింది. కాస్త వెయిట్ చేసి రిలాక్స్ అవ్వండి. ఇంకా ఫుల్ రన్ అవ్వలేదు. అది అయ్యాక మాట్లాడతాను అంటూ తెలిపారు. దీంతో శైలేష్ కొలను ట్వీట్ వైరల్ గా మారింది.