Hanuman : ‘హనుమాన్’ టీంపై సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారాలు చేస్తున్నారు.. సంచలన పోస్ట్ చేసిన డైరెక్టర్..

హనుమాన్ భారీ సక్సెస్ అవుతుండటంతో కొంతమంది కావాలని సినిమాపై, సినిమా టీంపై నెగిటివ్ ప్రచారాలు చేస్తున్నారు.

Hanuman : ‘హనుమాన్’ టీంపై సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారాలు చేస్తున్నారు.. సంచలన పోస్ట్ చేసిన డైరెక్టర్..

Hanuman Movie Director Prashanth Varma Reacts on Fake news and posts about his team and Movie

Updated On : January 15, 2024 / 8:23 AM IST

Hanuman Movie : ప్రశాంత్ వర్మ(Prashanth Varma) దర్శకత్వంలో తేజ సజ్జ(Teja Sajja) హీరోగా ఈ సంక్రాంతికి వచ్చిన హనుమాన్(Hanuman) సినిమా థియేటర్స్ లో దుమ్ము దులిపేస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు హనుమాన్ సినిమా బాగా నచ్చేసింది. రిలీజ్ కి ముందు థియేటర్ల ఇబ్బందులు, బడ్జెట్ ప్రాబ్లమ్స్.. ఇలా చాలా కష్టాలు పడి మూడేళ్ళ పాటు సినిమాని చేసి రిలీజ్ చేశారు. ఆ కష్టానికి ప్రతిఫలం వచ్చి కలెక్షన్స్ కూడా భారీ రేంజ్ లో వస్తున్నాయి.

అయితే రిలీజ్ కి ముందు థియేటర్స్ విషయంలో చాలా ఇబ్బందులు చూసింది హనుమాన్ టీం. తర్వాత హనుమాన్ భారీ సక్సెస్ అవుతుండటంతో కొంతమంది కావాలని సినిమాపై, సినిమా టీంపై నెగిటివ్ ప్రచారాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్ నుంచి హనుమాన్ టీం గురించి ఇష్టమొచ్చినట్టు పోస్ట్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ప్రశాంత్ వర్మ పేరుతోనే ఓ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి.. చరణ్ నన్ను డిన్నర్ కి పిలిచి నాతో సినిమా చేయమని అడిగాడు, నేను నో చెప్పాను అంటూ ఫేక్ న్యూస్ పోస్ట్ చేశారు. ఇలా డైరెక్టర్, సినిమాపై కొంతమంది నెగిటివ్ గా పోస్టులు చేస్తున్నారు.

Also Read : Rakesh Master : రాకేష్ మాస్టర్ చివరి సినిమా ‘హనుమాన్’ అని తెలుసా? కామెడీతో మెప్పించిన రాకేష్ మాస్టర్

తాజాగా ఇలాంటివాటిపై స్పందిస్తూ ప్రశాంత్ వర్మ గట్టిగా కౌంటర్ ఇచ్చాడు.. సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్ తో చాలా మంది మా టీం మీద, సినిమా మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. నిన్న భోగి రోజు ఇలాంటి డిజిటల్ చెత్తని మంటల్లోకి విసరడం మర్చిపోయినట్టు ఉన్నారు. ఏది ఏమైనప్పటికి ధర్మం కోసం నిలబడే వాడు ఎప్పటికైనా గెలుస్తాడు అని మా నమ్మకాన్ని నిజం చేస్తూ మా సినిమాకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. హనుమాన్ గాలిపటం ఈ సంక్రాంతికి మరింత ఎత్తుకు ఎదగడానికి సిద్ధంగా ఉంది అని పోస్ట్ చేశారు. దీంతో ప్రశాంత్ వర్మ ట్వీట్ వైరల్ అవ్వగా పలువురు నెటిజన్లు ఆయనకు సపోర్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు.