Rakesh Master : రాకేష్ మాస్టర్ చివరి సినిమా ‘హనుమాన్’ అని తెలుసా? కామెడీతో మెప్పించిన రాకేష్ మాస్టర్
హనుమాన్ సినిమాలో ఊరిపెద్దగా ఉన్న వ్యక్తి దగ్గర పులిరాజు అనే కామెడీ రౌడీ పాత్రలో కనిపించారు. సినిమాలో రెండు మూడు సార్లు కనిపిస్తారు రాకేశ్ మాస్టర్.

Rakesh Master plays a comedy Role in Hanuman movie considering as his last movie
Rakesh Master : రాకేశ్ మాస్టర్ తన డ్యాన్స్ తో కంటే కూడా చివరి రోజుల్లో ఇంటర్వ్యూలతోనే బాగా వైరల్ అయ్యారు. చిన్నప్పుడే సినీ పరిశ్రమకు వచ్చిన రాకేశ్ మాస్టర్ సైడ్ డ్యాన్సర్ నుంచి స్టార్ డ్యాన్స్ మాస్టర్ గా ఎదిగారు. ఆయన దగ్గర శిష్యరికం చేసిన ఎంతోమంది ఇప్పుడు స్టార్ డ్యాన్స్ మాస్టర్స్ గా ఉన్నారు. కానీ ఓ సమయంలో అవకాశాలు తగ్గిపోవడం, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడంతో మానసికంగా ఆయన దెబ్బ తిన్నారు. ఆ తర్వాత పలు యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఏదేదో మాట్లాడేసి వైరల్ అయ్యారు.
గత సంవత్సరం ఆయన ఆరోగ్య సమస్యలతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణించినా మీమ్స్, ఇంటర్వ్యూలతో ఇప్పటికి సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నారు. తాజాగా రాకేశ్ మాస్టర్ మరోసారి వైరల్ అవుతున్నారు. ఈ సంక్రాంతికి తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్(Hanuman) సినిమా రిలీజయి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో రాకేశ్ మాస్టర్ నటించారు.
Also Read : Prabhas : ప్రభాస్ నెక్స్ట్ సినిమా టైటిల్ అనౌన్స్.. ‘రాజా సాబ్’.. లుంగీ పైకెత్తిన ప్రభాస్..
హనుమాన్ సినిమాలో ఊరిపెద్దగా ఉన్న వ్యక్తి దగ్గర పులిరాజు అనే కామెడీ రౌడీ పాత్రలో కనిపించారు. సినిమాలో రెండు మూడు సార్లు కనిపిస్తారు రాకేశ్ మాస్టర్. కామెడీతో నవ్విస్తారు. తేజ సజ్జతో కూడా కాంబినేషన్ ఫైట్ సీన్ ఉంది. మొత్తానికి హనుమాన్ సినిమాలో రాకేశ్ మాస్టర్ తన కామెడీతో ప్రేక్షకులని నవ్వించారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో రెండేళ్ల క్రితమే మొదలుపెట్టారు. అప్పుడు ఆయన సినిమాలో నటించగా ఇప్పుడు ఆయన మరణించాక రిలీజ్ అవ్వడం బాధాకరం. దీంతో రాకేశ్ మాస్టర్ ని ఇలా హనుమాన్ సినిమాలో మళ్ళీ చూసి అభిమానులు, నెటిజన్లు సంతోషిస్తున్నారు. ఆయన బతికుంటే బాగుండేది, హనుమాన్ సక్సెస్ చూసి ఆనందపడేవారు, నటుడిగా ఇంకా అవకాశాలు వచ్చేవి అని కామెంట్స్ చేస్తున్నారు.