Prabhas : ప్రభాస్ నెక్స్ట్ సినిమా టైటిల్ అనౌన్స్.. ‘రాజా సాబ్’.. లుంగీ పైకెత్తిన ప్రభాస్..
ఇటీవలే ప్రభాస్ మారుతి సినిమా గురించి అధికారికంగా ప్రకటించి ఈ సినిమాలో వింటేజ్ ప్రభాస్ ని చూస్తారంటూ సంక్రాంతికి సినిమా టైటిల్ ప్రకటిస్తాం అని చిత్రయూనిట్ తెలిపారు.

Prabhas Maruthi Movie Tittle Announced Rajasaab goes Viral on Sankranthi
Prabhas : ప్రభాస్ చాలా గ్యాప్ తర్వాత సలార్(Salaar) సినిమాతో భారీ హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చాడు. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఈ లైనప్ లో డైరెక్టర్ మారుతి(Maruthi) దర్శకత్వంలో ప్రభాస్ ఓ లవ్ కమర్షియల్ సినిమా కూడా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా సగం అయిపోయిందని సమాచారం. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుండగా ఇందులో నిధి అగర్వాల్, రిధి కుమార్, మాళవిక మోహనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
Also Read : Prashanth Varma : ఇక నుంచి ప్రతి సంక్రాంతికి ఓ సూపర్ హీరో సినిమా.. హనుమాన్ డైరెక్టర్ ఆసక్తికర ప్రకటన..
ఇటీవలే ప్రభాస్ మారుతి సినిమా గురించి అధికారికంగా ప్రకటించి ఈ సినిమాలో వింటేజ్ ప్రభాస్ ని చూస్తారంటూ సంక్రాంతికి సినిమా టైటిల్ ప్రకటిస్తాం అని చిత్రయూనిట్ తెలిపారు. తాజాగా ఈ సినిమా టైటిల్ ని ప్రకటించారు చిత్రయూనిట్. రాజా సాబ్ అనే టైటిల్ ని ప్రకటిస్తూ ఓ పోస్టర్ ని కూడా రిలిజ్ చేశారు. ఈ పోస్టర్ లో ప్రభాస్ లుంగీ పైకెత్తి సంక్రాంతికి వచ్చే అల్లుడిలా ఉన్నాడు. పోస్టర్ అంతా చాలా కలర్ ఫుల్ గా ఉంది. దీంతో ఈ పోస్టర్ వైరల్ గా మారింది. ఇక ఈ సినిమా 2024 చివర్లో రిలీజవుతుందని సమాచారం. అయితే ఈ పోస్టర్ లో ప్రభాస్ ఫోటోలా కాకుండా గ్రాఫిక్స్ లో డిజైన్ చేసిన ఫేస్ లా కనిపిస్తుంది.
#TheRajaSaab It is… ?
Wishing you all a very Happy and Joyous Sankranthi! ❤️
? ?????’? ????????????? ???????? ????????? ???? ?#PrabhasPongalFeast #Prabhas
A @DirectorMaruthi film
Produced by @Vishwaprasadtg
A @MusicThaman Musical… pic.twitter.com/kvmUxIcXFC— People Media Factory (@peoplemediafcy) January 15, 2024