×
Ad

Bro 2: బ్రో 2 రెడీ.. సార్ డేట్స్ కోసం వెయిటింగ్.. షాకిచ్చిన దర్శకుడు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పెషల్ రోల్ చేసిన సినిమా బ్రో: ది అవతార్. మెగా హీరో సాయి దుర్గ తేజ్(Bro 2) హీరోగా వచ్చిన ఈ సినిమాను తమిళ దర్శకుడు సముద్రఖని తెరకెక్కించిన విషయం తెలిసిందే.

Director Samuthirakani makes shocking comments on Pawan Kalyan Bro 2 movie

Bro 2: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పెషల్ రోల్ చేసిన సినిమా బ్రో: ది అవతార్. మెగా హీరో సాయి దుర్గ తేజ్ హీరోగా వచ్చిన ఈ సినిమాను తమిళ దర్శకుడు సముద్రఖని తెరకెక్కించిన విషయం తెలిసిందే. తమిళంలో హిట్ అయిన వినోదయ సీతం సినిమాకు ఇది రీమేక్. ఈ సినిమాను కూడా సముద్రఖని డైరెక్ట్ చేశారు. మనిషి జీవితంలో సమయం అనేది ఎంత ప్రాధాన్యమైనది అనే కాన్సెప్ట్ తీసుకొని చాలా ఎమోషనల్ గా సినిమాను తెరకెక్కించాడు(Bro 2) దర్శకుడు. సినిమాలో ఉండే ఫ్యామిలీ ఎమోషన్స్ కి తమిళ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. కానీ, తెలుగులో ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు అనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ రేంజ్ సినిమా కాకపోవడంతో ఆడియన్స్ ఈ సినిమాను రిజెక్ట్ చేశారు.

Michael Teaser: పాప్ కింగ్ “మైఖెల్” జాక్స‌న్ బ‌యోపిక్.. టీజ‌ర్‌ వచ్చేసింది.. మీరు చూశారా?

అయితే, ఈ సినిమా విడుదల సమయంలోనే సీక్వెల్ కూడా ఉంటుందని చెప్పాడు దర్శకుడు. తాజాగా ఇదే విషయంపై ఆయన క్లారిటీ కూడా ఇచ్చేశాడు. రీసెంట్ గా ఆయన “కాంత” సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నాడు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. అందులో ఒక రిపోర్టర్ బ్రో 2 గురించి అడగగా.. బ్రో 2 స్క్రిప్ట్ రెడీ గా ఉంది. పవన్ కళ్యాణ్ సార్ ఎప్పుడు ఒకే అంటే అప్పుడు సినిమా సెట్స్ పైకి వెళుతుంది. అని చెప్పుకొచ్చాడు. దీంతో, దర్శకుడు సముద్రఖని చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. నిజానికి ఉస్తాద్ భగత్ సింగ్ తరువాత పవన్ సినిమాల నుంచి పూర్తిగా తప్పుకుంటారు అనుకున్నారు అంతా.. కానీ ఆ సినిమా తరువాత ఓజీ ప్రీక్వెల్ అండ్ సీక్వెల్ కూడా ఉండనుందని స్వయంగా పవన్ ప్రకటించాడు.

ఇప్పుడు దర్శకుడు సముద్రఖని చేసిన కామెంట్స్ చూస్తే.. బ్రో 2 సినిమా కూడా ఉండే అవకాశం ఉందని క్లియర్ గా అర్థం అవుతోంది. కాబట్టి, ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ వీలు దొరికినప్పుడల్లా సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి తాజాగా సముద్రఖని చెప్పినట్టుగా పవన్ ఈ సినిమాకు డేట్స్ అలాట్ చేస్తాడా. ఒక వేళ చేసిన ప్లాప్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా ఆడియన్స్ ను మెప్పిస్తుందా అనేది చూడాలి.