×
Ad

Charan-Sandeep: వైలెంట్ కాంబో లోడింగ్.. రీసెంట్ గా కలిసిన స్టార్స్.. త్వరలోనే..

ఇండస్ట్రీలో మరో వైలెంట్ కాంబో సెట్ కానుందా అనే అవుననే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. (Charan-Sandeep)అయితే, ఆ వైలెంట్ కాంబో మరేదో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.

Director Sandeep Reddy Vanga is planning a film with Ram Charan.

Charan-Sandeep: ఇండస్ట్రీలో మరో వైలెంట్ కాంబో సెట్ కానుందా అనే అవుననే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే, ఆ వైలెంట్ కాంబో మరేదో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. అవును, ఇద్దరు స్టార్స్ కాంబోలో ఒక భారీ ప్రాజెక్టు (Charan-Sandeep)రాబోతుండట. ఇటీవల స్పెషల్ టైం తీసుకొని రామ్ చరణ్ ని కలిశాడట సందీప్. ఒక పౌర ఫుల్ కాన్సెప్ట్ ని కూడా వివరించాడట. అది బాగా నచ్చడంతో వెంటనే ఒకే చెప్పేశాడట రామ్ చరణ్. పూర్తి కథతో రావాల్సిందిగా చెప్పాడట చరణ్. ఈ ప్రాజెక్టుపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది అని ఇండస్ట్రీ నుంచి వస్తున్న టాక్.

Chikiri Song: మెరుపులు లేవు.. స్టార్ పైనే ఫోకస్.. చికిరి సాంగ్ పై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్

సోషల్ మీడియాలో కూడా ఈ మధ్యనే రామ్ చరణ్, సందీప్ రెడ్డి వంగా ఒకరినొకరు ఫాలో చేసుకుంటున్నారు. దీంతో, వీరి కాంబోలో సినిమా రాబోతుంది అనే వార్తలకు బలం చేకూరింది. ఇక ఈ న్యూస్ విని మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా లాంటి దర్శకుడు రామ్ చరణ్ కి పడితే ఆ రిజల్ట్ ఒకరు రేంజ్ లో ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రెజెంట్ రామ్ చరణ్ పెద్ది కోసం లాంగ్ హెయిర్, గడ్డంతో కనిపిస్తున్నాడు. అదే లుక్ లో సందీప్ తో సినిమా చేస్తే ఇండియన్ సినీ రికార్డ్స్ అన్ని మటాష్ అవుతాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే, రామ్ చరణ్ ప్రస్తుతం డైరెక్టర్ బుచ్చిబాబుతో పెద్ది సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో భారీగా వస్తున్న ఈ సినిమా 2026 మర్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు. ఇంటర్నేషనల్ లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలయ్యింది. ప్రభాస్ ఈ సినిమాలో మొదటిసారి పోలీస్ గా కనిపించనున్నాడు. ఈ రెండు ప్రాజెక్టులు కంప్లీట్ అయిన తరువాత రామ్ చరణ్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో రానున్న సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.