Chikiri Song: మెరుపులు లేవు.. స్టార్ పైనే ఫోకస్.. చికిరి సాంగ్ పై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. పాన్ ఇండియా(Chikiri Song) లెవల్లో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్నాడు.
Ram Gopal Varma shocking comments on Chikiri song
Chikiri Song: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. పాన్ ఇండియా లెవల్లో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ప్రత్యేక(Chikiri Song) పాత్రలో కనిపించనున్నాడు. గేమ్ ఛేంజర్ లాంటి డిజాస్టర్ తరువాత వస్తున్న పెద్ది సినిమాపై మెగా అభిమానులు చాలా ఆశలే పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ ఉండటంతో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.
Meenakshi Chowdhury: చిరంజీవితో సినిమా.. నా లైఫ్ లో కొత్త ఛాప్టర్.. ఆ విషయంలో నో చెప్పేస్తాను..
రీసెంట్ గా ఈ సినిమా నుంచి చికిరి సాంగ్ విడుదలైన విషయం తెలిసిందే. ఏఆర్ రహమాన్ సంగీతం అందించిన ఈ పాట ఒక రేంజ్ బ్లాక్ బస్టర్ అయ్యింది. రామ్ చరణ్ గ్రేస్ ఫుల్ డాన్స్, మోహిత్ చౌహాన్ అద్భుతమైన గానం, రహమాన్ మ్యూజిక్, జాన్వీ అందాలు కలిసి సాంగ్ ను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాయి. దీంతో ప్రస్తుతం ఎక్కడ చూసిన ఈ సాంగ్ గురించే చర్చ నడుస్తోంది. రామ్ చరణ్ వేసిన హుక్ స్టెప్ ని రీక్రియెట్ చేస్తూ రీల్స్ చేస్తున్నారు నెటిజన్స్. సాంగ్ కూడా సూపర్ హిట్ అవడంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.
తాజాగా చికిరి పాటపై ఆసక్తికర కామెంట్స్ చేశారు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ పాట గురించి ఆయన మాట్లాడుతూ.. “డైరెక్షన్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఏ క్రాఫ్ట్ అయినా హీరోని ఎలివేట్ చేయడం కోసమే పని చేస్తాయి. చికిరి సాంగ్ లో రామ్ చరణ్ చాలా రా అండ్ రియల్ ఎక్స్‌ప్లోసివ్ గా కనిపించాడు. అనవసరమైన మెరుపులు లేవు, భారీ సెట్స్ లేవు, వందల మంది డ్యాన్సర్స్ లేరు.. ఇవేవి లేకుండా స్టార్ ని మెరిపించిన దర్శకుడు బుచ్చి బాబు సానాకు నా అభినందనలు. కేవలం స్టార్ పై నే ఫోకస్ చేయాలన్న నియమాన్ని తీసుకున్నావు” అంటూ రాసుకొచ్చాడు. దీంతో రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
