Arjun Reddy Deleted Scene : అర్జున్ రెడ్డి సినిమాలో డిలీట్ చేసిన సీన్ చూశారా..? ‘అర్జున్ రెడ్డి’కి ఐదేళ్లు.. డిలీట్ వీడియోని షేర్ చేసిన డైరెక్టర్..

విజయ్ దేవరకొండ, షాలిని పాండే జంటగా 2017 ఆగస్టు 25న రిలీజ్ అయి భారీ విజయం సాధించింది అర్జున్ రెడ్డి సినిమా. ఈ సినిమా విజయ్ ని హీరోగా నిలబెట్టింది. షాలినికి, డైరెక్టర్ సందీప్ కి బాలీవుడ్ లో........

  • Published On : August 27, 2022 / 07:26 AM IST

Director sandeep vanga shares arjun reddy movie deleted scene

Arjun Reddy Deleted Scene :  విజయ్ దేవరకొండ, షాలిని పాండే జంటగా 2017 ఆగస్టు 25న రిలీజ్ అయి భారీ విజయం సాధించింది అర్జున్ రెడ్డి సినిమా. ఈ సినిమా విజయ్ ని హీరోగా నిలబెట్టింది. షాలినికి, డైరెక్టర్ సందీప్ కి బాలీవుడ్ లో ఆఫర్స్ వచ్చేలా చేసింది. ఈ ఒక్క సినిమాతో ఆ చిత్ర యూనిట్ అందరి జాతకాలు మారిపోయాయి. అర్జున్ రెడ్డి సినిమా వేరే భాషల్లోకి కూడా రీమేక్ అయింది. ఆగస్టు 25 నాటికి ఈ సినిమా రిలీజ్ అయి అయిదు సంవత్సరాలు అయింది. దీంతో అర్జున్ రెడ్డి టీం సోషల్ మీడియాలో థాంక్స్ చెప్తూ స్పెషల్ పోస్టులు వేస్తున్నారు.

ఇందులో భాగంగానే డైరెక్టర్ సందీప్ వంగా అర్జున్ రెడ్డి సినిమాలోని ఓ డిలీట్ సీన్ ని షేర్ చేశారు. ఈ వీడియో షేర్ చేస్తూ అర్జున్ రెడ్డి సినిమాకి పనిచేసిన యూనిట్ అందరికి థ్యాంక్స్ చెప్పాడు. ఈ వీడియో సినిమాలో ప్రీతికి కిస్ ఇస్తుంటే వాళ్ళ నాన్న వచ్చి చూసే సీన్ తర్వాత ఉండేది. ఆ సీన్ అయ్యాక విజయ్, ఫ్రెండ్ క్యారెక్టర్ రాహుల్ రామకృష్ణ కూర్చొని మాట్లాడుకుంటారు. ఇందులో విజయ్.. నేను ప్రీతికి ప్రేమతో కిస్ ఇచ్చా కలిసి చాలా రోజులైందని. దాన్ని వాళ్ళ నాన్న తప్పుగా అర్ధం చేసుకున్నాడు అని రామకృష్ణకి చెప్తాడు.

Kaun Banega Crorepati : కౌన్ బనేగా క్రోర్‌పతిలో షర్ట్ విప్పి రచ్చ చేసిన కంటెస్టెంట్.. అమితాబ్ కౌంటర్.. వైరల్ అవుతున్న వీడియో..

రామకృష్ణ వల్ల నాన్న పాయింట్ అఫ్ వ్యూలో మాట్లాడి నువ్వు చేసింది వాళ్ళ నాన్నకి తప్పుగానే అనిపిస్తుంది అని తండ్రి, కూతుళ్ళ రిలేషన్ గురించి విజయ్ కి చెప్తాడు. ప్రస్తుతం ఈ డిలీటెడ్ సీన్ వైరల్ గా మారింది. ఈ సీన్ సినిమాలో పెట్టి ఇంకా బాగుండేదని విజయ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.