Globe Trotter Event: గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో డైరెక్టర్ రాజమౌళి మాట్లాడారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయడం చాలా గర్వంగా ఉందన్నారు. ఈ సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు కొత్త టెక్నాలజీని పరిచయం చేశామన్నారాయన. ఇది కూడా తనకు చాలా ప్రౌడ్ గా ఉందని చెప్పారు.
”నన్ను, మహేశ్ ను కలిపినందుకు కేఎల్ నారాయణకు థ్యాంక్యూ.. నేను ప్రతి సినిమా ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టి కథ చెప్పడం నాకు అలవాటుగా మారింది. కొన్ని సినిమాలకు కథ చెప్పడం కుదురుతుంది, కొన్ని సినిమాలకు కుదరదు. ఈ సినిమా కథని మాటల్లో చెప్పడం కుదరదు. అందుకని ఒక డెసిషన్ తీసుకున్నాం.
కథ చెప్పకూడదు, ఆడియన్స్ అంచనాలు అందుకోవాలి.. ఏం చేద్దాం అని అనుకుంటే.. చివరకు ఒక నిర్ణయం తీసుకున్నాం. లెట్స్ మేక్ యాన్ అనౌన్స్ మెంట్ వీడియో. ఒక్క మాట చెప్పకుండా వీడియో చూస్తే సినిమాలో కథ ఏంటో, స్కేల్ ఏంటో, స్కోప్ ఏంటో అర్థం అయ్యేలా వీడియో చేద్దామని అనుకున్నాం. అది సినిమా బిగినింగ్ లోనే రిలీజ్ చేద్దాం అని అనుకున్నాం. మార్చిలో విడుదల చేద్దామని అనుకున్నాం. కానీ వీడియో రాలేదు. నెలలు గడుస్తున్నా వీడియో రాలేదు. కానీ, వర్షాలు వచ్చాయి. హైదరాబాద్ లో కంటిన్యూ గా వానలు పడుతూనే ఉన్నాయి. మొత్తానికి నవంబర్ 15కి వీడియోతో మీ ముందుకు వచ్చాం. ఐయామ్ వెరీ హ్యాపీ. ఈ వీడియో.. ఈ సినిమా కథ ఏంటో, స్కోప్ ఏంటో చెబుతుంది. టైటిల్ చెప్పకుండా దిస్ ఫిలిమ్ దిస్ ఫిలిం అంటుంటే చాలా కష్టంగా ఉంది.
నాకు చిన్నప్పుడు కృష్ణ గారి గొప్పదనం తెలియదు. నేను ఎన్టీఆర్ ఫ్యాన్ ని. అన్నీ ఎన్టీఆర్ సినిమాలే చూసేవాడిని. కానీ ఇండస్ట్రీకి వచ్చాక, సినిమా అంటే ఏంటో అర్థమయ్యాక కృష్ణ గారి గొప్పదనం తెలిసింది. ఒక కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయాలంటే ఎన్నో దారులను బ్రేక్ చేసుకుంటూ కొత్త దారులు వేసుకుంటూ వెళ్లాలి. అలాంటిది కృష్ణగారు ఒకటి కాదు.. ఎన్నో టెక్నాలజీలను తెలుగు సినిమాకు పరిచయం చేశారు.
ఫస్ట్ సినిమా స్కోప్ ఫిలిమ్ అల్లూరి సీతారామరాజు. ఫస్ట్ ఈస్ట్ మన్ కలర్ ఫిలిమ్ ఈనాడు. ఫస్ట్ 70ఎంఎం ఫిలిం సింహాసనం. ఇలా ఎన్నో కొత్త టెక్నాలజీస్ ని కృష్ణ గారు ఇంట్రడ్యూస్ చేశారు. అలాంటి కృష్ణగారి అబ్బాయి మహేశ్ తో సినిమా చేయడం.. ఐయామ్ సో ప్రౌడ్ టు సే.. తెలుగు సినిమాకు కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ప్రీమియం లార్జ్ స్కేల్ ఫార్మాట్” అని రాజమౌళి అన్నారు.
”మహేష్ బాబుది చాలా గొప్ప క్యారెక్టర్. ఆయన నుంచి మనం అందరం నేర్చుకునే గుణం ఒకటి ఉంది. మనందరికి సెల్ ఫోన్ అడిక్షన్ ఉంది. కానీ, మహేశ్ అలాంటి వ్యక్తి కాదు. షూటింగ్ కు వచ్చారంటే సెల్ ఫోన్ ముట్టుకోరు. ఎన్ని గంటలు అయినా సరే.. ముట్టుకోరు. ఫోన్ కారులోనే ఉంటుంది. షూటింగ్ పూర్తయ్యాక కారులోకి వెళ్లాకే ఆయన తన సెల్ ఫోన్ చూస్తారు. ఆయన నుంచి మనందరం అది నేర్చుకోవాలి. అందరం దాన్ని పాటించాలి. మీలా ఉండేందుకు నేను ట్రై చేస్తాను” అని రాజమౌళి అన్నారు.
”మహేష్ కి రాముడి వేషం వేసి ఫోటోస్ తీస్తుంటే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. మహేశ్ కొంటెగా ఉంటాడు. కృష్ణుడికి కరెక్ట్ గా సెట్ అవుతాడు. రాముడి లాంటి ప్రశాంతమైన క్యారెక్టర్ కి మహేష్ సూట్ అవుతాడా అనే ఒక డౌట్. కచ్చితంగా సూట్ అవుతాడనే నమ్మకం. అలా ఊగిసలాట మధ్య ఫోటో షూట్ చేశాం. ఈ సినిమా నా కెరీర్ లో మర్చిపోలేని చిత్రం అవుతుంది. మహేష్ కెరీర్ లో కూడా. ఈ సినిమాలో మహేశ్ బాబు మీరు ఊహించనంత అందంగా ఉంటాడు. మీరు ఊహించనంత పరాక్రమంగా ఉంటాడు. మీరు ఊహించనంత కోపంగా ఉంటాడు. రాముడిగా అన్ని రసాలు చూపించాడు” అని రాజమౌళి తెలిపారు.
Also Read: నిజంగా ఈ హీరోయిన్ గ్రేట్.. షూటింగ్ లో అందరూ జ్వరం వచ్చి పడిపోతే.. ఇంత మంచోళ్ళు ఎవరుంటారు భయ్యా..