×
Ad

Nani-Sujeeth: నాని సినిమాపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన సుజీత్.. మరో బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్

దర్శకుడు సుజీత్ ప్రస్తుతం ఓజీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. తన ఫెవరేట్ హీరో (Nani-Sujeeth)పవన్ కళ్యాణ్ తో చేసిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది.

Director Sujeeth gives a crazy update on Nani's film

Nani-Sujeeth: దర్శకుడు సుజీత్ ప్రస్తుతం ఓజీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. తన ఫెవరేట్ హీరో పవన్ కళ్యాణ్ తో చేసిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. స్టైలీష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా మొదటిరోజు ఏకంగా రూ.154 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఇదే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ అవడం విశేషం. అయితే, ఓజీ సినిమా భారీ విజయం సాధించిన నేపధ్యంలో సుజీత్ తదుపరి(Nani-Sujeeth) సినిమాపై ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే సుజీత్ తన నెక్స్ట్ సినిమాను నేచురల్ స్టార్ నానితో ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.

Sai Pallavi: సాయి పల్లవికి అరుదైన గౌరవం.. ప్రముఖుల జాబితాలో నటికి చోటు

నాని పుట్టినరోజు సందర్బంగా విడుదల చేసిన అనౌన్స్ మెంట్ వీడియోకి ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. అప్పటినుంచి ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని నాని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఓజీ భారీ విజయం సాధించడంతో ఆ వెయిటింగ్ ఇంకా ఎక్కువ అయ్యింది. ఈ నేపథ్యంలో నానితో చేయబోయే సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు సుజీత్. నాని కెరీర్ లో 32వ సినిమా గా వస్తున్న ఈ ప్రాజెక్టు సుజీత్ మొదటి సినిమా రన్ రాజా రన్ తరహాలో ఉంటుందట. అలాగే డార్క్ కామెడీకి కాస్త యాక్షన్ జోడించి ఈ సినిమా చేస్తున్నాడట సుజీత్.

ప్రెజెంట్ జనరేషన్ లో ఇది చాలా సక్సెస్ ఫుల్ ఫార్ములా అనే చెప్పాలి. కాబట్టి, సుజీత్-నాని మరి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడానికి సిద్ధం అవుతున్నారు అని అర్థం అవుతుంది. త్వరలో షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇక నాని విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ది పారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా విడుదల తరువాత నాని-సుజీత్ సినిమా విడుదల కానుంది.