కూలి పని చేసి నన్ను సినిమాలకు తీసుకెళ్లేవాడు కిట్టయ్య – సుకుమార్ భావోద్వేగం

‘రాజావారు రాణిగారు’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకులు సుకుమార్ తన స్నేహితుడు కిట్టయ్య గురించి భావేద్వేగంతో మాట్లాడారు..

  • Published By: sekhar ,Published On : November 19, 2019 / 10:10 AM IST
కూలి పని చేసి నన్ను సినిమాలకు తీసుకెళ్లేవాడు కిట్టయ్య – సుకుమార్ భావోద్వేగం

Updated On : November 19, 2019 / 10:10 AM IST

‘రాజావారు రాణిగారు’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకులు సుకుమార్ తన స్నేహితుడు కిట్టయ్య గురించి భావేద్వేగంతో మాట్లాడారు..

‘రాజావారు రాణిగారు’.. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం.. కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్‌లను హీరో, హీరోయిన్లుగా పరిచయం చేస్తూ.. రవి కిరణ్ కోలా దర్శకత్వంలో, ఎస్.ఎల్.ఎంటర టైన్‌మెంట్స్, మీడియా9 పతాకాలపై మనోవికాస్, మీడియా9 మనోజ్ సంయుక్తంగా నిర్మించారు.. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ సమర్పిస్తోంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సోమవారం హైదరాబాద్‌లో జరిగింది.

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, యంగ్ హీరో సందీప్ కిషన్ ముఖ్య అతిథులుగా విచ్చేసి, యూనిట్‌ని అభినందించారు. ఈ సందర్భంగా సుకుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన  తన చిన్ననాటి స్నేహితుడు కిట్టయ్య గురించి మాట్లాడారు..

 

Read Also : ఈ తరానికి కనెక్ట్ అయ్యే సినిమా ‘జార్జ్ రెడ్డి’ – మెగాస్టార్ చిరంజీవి

 

‘కిట్టయ్య నా ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్.. కొన్నిసార్లు కావాలని ఎవరైనా కనిపిస్తే ఇలా చెయ్యేసేసి నా ఫ్రెండ్ అని చెప్తాం కదా.. అలా కాదు, నిజమైన స్నేహితుడు.. నా కాలిలో ముల్లు గుచ్చుకుంటే తన కళ్లల్లో నీళ్లొస్తాయ్.. నాకేదైనా అయితే తట్టుకోలేడు వాడు.. ఏడ్చేస్తాడు.. నాకు చిన్నప్పుడు సినిమాలంటే చాలా ఇష్టం.. వీడు కూలి పని చేసి నన్ను సినిమాకి తీసుకెళ్లేవాడు.. నాకు సినిమా అంటే ఇష్టమని వాడు కూలి పనికి వెళ్లి సాయంత్రం ఆ డబ్బులతో నన్ను సినిమాకి తీసుకెళ్లువాడు’.. అంటూ భావేద్వేగానికి గురయ్యారు సుకుమార్.. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే 1 మిలియన్ వ్యూస్ దాటేసింది.. ఈ నెల 29న ‘రాజావారు రాణిగారు’ రిలీజవుతోంది.