Director Sukumar finalizes story for Ram Charan next movie
Ram Charan-Sukumar: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తుండగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్, సాంగ్, రామ్ చరణ్ లుక్స్ ఒక రేంజ్ లో వైరల్ అయ్యాయి. దీంతో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని మెగా ఫ్యాన్స్ తో సహా.. నార్మల్ ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
Sai Abhyankar: రజినీకాంత్ మూవీకి సాయి అభ్యంకర్ మ్యూజిక్.. అనిరుధ్ ని పక్కన పెట్టేసిన సూపర్ స్టార్
ఇక ఈ సినిమా తరువాత రామ్ చరణ్ మరోసారి స్టార్ డైరెక్టర్ సుకుమార్(Ram Charan-Sukumar) తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చింది. అయితే, రీసెంట్ గా ఈ సినిమా కథను ఫైనల్ డ్రాఫ్ట్ ను రెడీ చేశాడట సుకుమార్. ఫైనల్ న్యారేషన్ కోసం రామ్ చరణ్, సుకుమార్ త్వరలోనే దుబాయ్ వెళ్లనున్నారట. అక్కడే ఈ భారీ ప్రాజెక్టుకి సంబందించిన ఫైనల్ న్యారేషన్ అండ్ చిన్న చిన్న ఛేంజెస్ చేస్తాడట సుకుమార్. ఇక అక్కడినుంచి వచ్చాక ఈ ప్రాజెక్టుకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టనున్నాడట సుకుమార్.
ఇక సుకుమార్-రామ్ చరణ్ కాంబోలో రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ఈ కాంబోలో రాబోతున్న కొత్త సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో పెరుగుతున్నాయి. ఇక ఈ సినిమాకు కూడా సుకుమార్ గత చిత్రాలకు సంగీతం అందించిన దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. మార్చ్ 27న పెద్ది విడుదల ఆయిన తరువాత సుకుమార్-రామ్ చరణ్ ప్రాజెక్టు పూజ కార్యక్రమాలతో లాంఛనంగా మొదలవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు చేస్తారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.