Sai Abhyankar: రజినీకాంత్ మూవీకి సాయి అభ్యంకర్ మ్యూజిక్.. అనిరుధ్ ని పక్కన పెట్టేసిన సూపర్ స్టార్

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ ఎవరంటే సాయి అభ్యంకర్(Sai Abhyankar) అనే చెప్పాలి. తమిళ ఇండస్ట్రీలో ప్రైవేట్ ఆల్బమ్స్ తో పాపులారిటీ తెచ్చుకున్న ఈ కుర్ర మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు స్టార్ హీరోలకి ఫస్ట్ ఛాయస్ గా మారిపోయాడు.

Sai Abhyankar: రజినీకాంత్ మూవీకి సాయి అభ్యంకర్ మ్యూజిక్.. అనిరుధ్ ని పక్కన పెట్టేసిన సూపర్ స్టార్

Sai Abhyankar composing music for Rajinikanth next movie

Updated On : December 4, 2025 / 8:10 PM IST

Sai Abhyankar: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ ఎవరంటే సాయి అభ్యంకర్ అనే చెప్పాలి. తమిళ ఇండస్ట్రీలో ప్రైవేట్ ఆల్బమ్స్ తో పాపులారిటీ తెచ్చుకున్న ఈ కుర్ర మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు స్టార్ హీరోలకి ఫస్ట్ ఛాయస్ గా మారిపోయాడు. ఇప్పటికే ఈ సంగీతంను సెన్సేషన్ ఆడించిన సినిమాలు మ్యూజికల్ చాట్ బస్టర్ అయ్యాయి. అందుకే వరుసగా స్టార్ హీరోలందరూ సాయి అభ్యంకరే(Sai Abhyankar) కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన చేతిలో పదికి పైగా సినిమాలు ఉన్నాయి. వాటిలో, అల్లు అర్జున్-అట్లీ లాంటి హాలీవుడ్ రేంజ్ సినిమా ఉంది.

Lenin: ఈ ఇయర్ అన్న కొట్టాడు.. నెక్స్ట్ ఇయర్ తమ్ముడు కొడతాడా.. లెనిన్ కోసం అదిరిపోయే డేట్ ఫిక్స్..

అలాగే, సూర్య హీరోగా వస్తున్న పాన్ ఇండియా సినిమా కురుప్పు కూడా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సింగ్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ లిస్టులో చాలా సినిమాలే ఉన్నాయి. ఇప్పుడు ఈ లిస్టులో మరో భారీ చేరినట్టుగా తెలుస్తోంది. అదేంటంటే, సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఇటీవల కొత్త సినిమా స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సుందర్ సి దర్శకత్వం వహిస్తాడు అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఈ ప్రాజెక్టు నుంచి ఆయన తప్పుకున్నాడు. మరో కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టుగా తమిళనాట టాక్ నడుస్తోంది.

ఇదిలా ఉంటే, పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనున్న ఈ సినిమాకు మ్యూజిక్ అందించే అవకాశాన్ని మేకర్స్ లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ కి ఇచ్చారట. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది అని తెలుస్తోంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే, రజినీకాంత్ ఆయన సినిమాలకు మ్యూజిక్ చేసే అవకాశాన్ని స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కి ఇస్తూ వస్తున్నాడు. అలాంటిది ఇప్పుడు అనిరుధ్ ని పక్కన పెట్టి సాయి అభ్యంకర్ కి ఛాన్స్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. నిజంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే సాయి అభ్యంకర్ ఇక ఆపడం ఎవరి వల్ల కాదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి రజినీకాంత్ సినిమాకు మొదటిసారి మ్యూజిక్ ఇస్తున్న సాయి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అనేది చూడాలి.