Sukumar : డైరెక్టర్ సుకుమార్ వాట్సాప్ DP ఎవరి ఫోటో పెట్టుకున్నారో తెలుసా..?

తాజాగా సుకుమార్ వాట్సాప్ డీపీ వైరల్ గా మారింది.

Director Sukumar Whatsapp DP leaked by Sudheer Babu and its goes Viral

Sukumar : మొదట లవ్ స్టోరీలతో మెప్పించిన డైరెక్టర్ సుకుమార్ రంగస్థలం నుంచి తన మాస్ ని బయటకు తీసి అదరగొడుతున్నారు. పుష్ప తో పాన్ ఇండియా హిట్ కొట్టిన సుకుమార్ త్వరలో పుష్ప 2 సినిమాతో రాబోతున్నాడు. సుకుమార్ – అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కోసం ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సుకుమార్ ఆ పనుల్లోనే బిజీగా ఉన్నారు.

అయితే తాజాగా సుకుమార్ వాట్సాప్ డీపీ వైరల్ గా మారింది. సుకుమార్ ఇటీవల మా నాన్న సూపర్ హీరో సినిమా టీజర్ చూసి హీరో సుధీర్ బాబును అభినందిస్తూ మెసేజ్ చేసారు. సుకుమార్ చేసిన మెసేజ్ ని స్క్రీన్ షాట్ తీసి సుధీర్ బాబు తన సోషల్ మీడియాలో షేర్ చేసి థ్యాంక్స్ చెప్పారు. అయితే ఈ స్క్రీన్ షాట్ లో సుకుమార్ వాట్సాప్ డీపీ కూడా కనిపిస్తుంది.

Also Read : Megastar Chiranjeevi : మెగాస్టార్ కి మరో గౌరవం.. అబూ దాబిలో అందుకున్న అవార్డు..

డైరెక్టర్ సుకుమార్ తన వాట్సాప్ డీపీగా తన తండ్రి ఫోటో పెట్టుకున్నారు. దీంతో ఈ వాట్సాప్ చాట్ వైరల్ గా మారింది. సుధీర్ బాబు కూడా.. మీ డీపీలో మీ నాన్నగారి ఫోటో ఉంది. మీ నాన్న గారంటే మీకు ఎంత ఇష్టమో తెలుస్తుంది. మా సినిమా కూడా నాన్నని సూపర్ హీరోగా చూసే ఓ అబ్బాయి కథ అని రిప్లై ఇచ్చారు.

సుకుమార్ తండ్రి తిరుపతిరావు కొన్నేళ్ల క్రితం మరణించారు. సుకుమార్ కి నాన్నతో మంచి అనుబంధం ఉంది. అందుకే తన సినిమాల్లో తండ్రి పాత్రలకు కాస్త బలమైన కథనం ఉంటుంది. తన తండ్రి జ్ఞాపకార్థం సుకుమార్ గతంలో తాను పుట్టిన ఊళ్ళో తండ్రి పేరు మీద స్కూల్ కి బిల్డింగ్ కూడా కట్టించాడు. ఇప్పుడు ఇలా సుకుమార్ వాట్సాప్ డీపీ వైరల్ అవ్వడంతో సుకుమార్ కి నాన్న అంటే ఎంత ఇష్టమో అని కామెంట్స్ చేస్తున్నారు.