Director Teja : SPB చివరి కోరిక అని ఆర్పీ పట్నాయక్‌కి ఛాన్స్ ఇచ్చా.. చంద్రబోస్ లిరిక్స్ నచ్చలేదని గొడవ!

ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం చివరి కోరిక అని ఆర్పీ పట్నాయక్ తేజ అహింస సినిమాలో ఛాన్స్ ఇచ్చాడట. అయితే పట్నాయక్ ఒక సాంగ్ విషయంలో ఆస్కార్ అందుకున్న చంద్రబోస్ ఇచ్చిన లిరిక్స్ నచ్చలేదని గొడవ చేశాడట.

Director Teja : SPB చివరి కోరిక అని ఆర్పీ పట్నాయక్‌కి ఛాన్స్ ఇచ్చా.. చంద్రబోస్ లిరిక్స్ నచ్చలేదని గొడవ!

Director Teja comments on R P Patnaik S P Balasubrahmanyam Chandrabose

Updated On : June 1, 2023 / 8:09 PM IST

Director Teja – R P Patnaik : టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ అందించిన ఎన్నో సాంగ్స్ ఇప్పటికి చాలా మంది ఫేవరిట్ లిస్ట్ లో వింటుంటాం. అప్పటిలో యూత్ లో పట్నాయక్ సాంగ్స్ కి ఒక రేంజ్ క్రేజ్ ఉంది. ఇక అలాగే డైరెక్టర్ తేజ, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ కాంబినేషన్ కూడా టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. అయితే పట్నాయక్ మాత్రం సంగీత దర్శకుడిగా ఆ జర్నీని మధ్యలోనే ఆపేశాడు. నటన, దర్శకత్వం పై అడుగులు వేసి ఎంతోమంది సంగీత ప్రియులను నిరాశకు గురి చేశాడు.

Nikhil Siddhartha : నిఖిల్ మరో పాన్ ఇండియా మూవీ.. ‘స్వయంభు’ ఫస్ట్ లుక్ పోస్టర్!

తాజాగా ఇన్నాళ్ల తరువాత మళ్ళీ ఇప్పుడు తేజ తెరకెక్కిస్తున్న అహింస (Ahimsa) సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. అయితే కొంతమంది మాత్రం.. ప్రస్తుతం టైం లైన్ లో లేని ఆర్పీ పట్నాయక్ ని తేజ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అనే ప్రశ్నలు వేస్తున్నారు. పట్నాయక్ ని ఎంపిక చేసుకోవడంలో స్వర్గీయ ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం (S P Balasubrahmanyam) చివరి కోరిక ఉందట. పట్నాయక్ ని ఎస్పీబీ మళ్ళీ సంగీత దర్శకుడిగా రమ్మని చాలా సార్లు అడిగేవారట. ఇక ఎస్పీబీ చనిపోయిన తరువాత ఆయన కోరిక తీర్చడానికి ఆర్పీ.. తేజ దగ్గరకి వచ్చి ఈ విషయాన్ని చెప్పాడట.

Bloody Daddy : డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అవుతున్న షాహిద్ ‘బ్లడీ డాడీ’.. అలాగే ఈ వారం ఓటీటీ రిలీజ్స్!

దీంతో తేజ వెంటనే తన నెక్స్ట్ సినిమాకి చేద్దాం అని మాట ఇచ్చేశాడు. అలా అహింస సినిమాలోకి పట్నాయక్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఒక సాంగ్ విషయంలో ఆర్పీ.. ఆస్కార్ అందుకున్న చంద్రబోస్ (Chandrabose) ఇచ్చిన లిరిక్స్ నచ్చలేదని గొడవ చేశాడట. లిరిక్స్ అర్ధం బాగున్నా, సౌండింగ్ పరంగా ఆ లిరిక్స్ పట్నాయక్ నచ్చలేదట. ఈ విషయంలో తేజకి, ఆర్పీ పట్నాయక్ కి ఆర్గుమెంట్ జరిగిందట. అయితే ఫైనల్ గా చంద్రబోస్ తో మరో లిరిక్స్ ని రాయించారట. ఆ లిరిక్స్ అందరికి నచ్చాయని తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తేజ చెప్పుకుకొచ్చాడు.