Director trivikram God of war movie with ntr
Ntr: ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా రచ్చ రచ్చ చేస్తున్నారు. ఆ ఆనందానికి బలమైన కారణమే ఉంది. ఆ కారణం ఏంటంటే, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో సినిమా చేయడమే. అదేంటి, లోకేష్ తో బన్నీ సినిమా చేస్తే బన్నీ ఫ్యాన్స్ హ్యాపీ ఫీలవ్వాలి కానీ, ఎన్టీఆర్(Ntr) ఫ్యాన్స్ ఆనందపడటం ఏంటా అనుకుంటున్నారా.
మరి అక్కడే ఉంది అసలు కథ అంతా.. అదేంటంటే.. అల్లు అర్జున్ ప్రస్తుతం దర్శకుడు అట్లీతో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన దర్శకుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తాడని అందరు అనుకున్నారు. ఈ ఇద్దరి కాంబోలో ఇండియన్ మైథలాజీ కాన్సెప్ట్ తో ఓ సినిమా చేయనున్నారు అంటూ గతంలో చాలా వార్తలు వచ్చాయి. దానికి గాడ్ ఆఫ్ వార్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారంటూ కూడా కామెంట్స్ వినిపించాయి.
45 OTT: ఓటీటీలో సూపర్ హిట్ మూవీ ’45’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఆ తరువాత మనసు మార్చుకున్న దర్శకుడు త్రివిక్రమ్ అదే కథను అల్లు అర్జున్ తో కాకుండా ఎన్టీఆర్ తో చేయాలనీ ప్లాన్ చేశాడట. అదే సమయంలో కుమారస్వామికి సంబందించిన పుస్తకాన్ని చేతిలో పట్టుకొని ఒక చోట కనిపించాడు ఎన్టీఆర్. దీంతో, ఎన్టీఆర్ ఈ సినిమా చేస్తున్నాడు అంటూ తెగ చర్చ నడిచింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈ భారీ ప్రాజెక్టుపై చాలా ఆశలే పెట్టుకున్నారు. కానీ, ఈ ప్రాజెక్టుపై కూడా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఇక అప్పటినుంచి త్రివిక్రమ్ ఆ కథను ఏ హీరోతో చేస్తాడు అనేది సస్పెన్స్ గా మారింది. చివరికి అల్లు అర్జున్ తోనే చేశాడు అనుకున్నారు అంతా. కానీ, అల్లు అర్జున్ మాత్రం తన నెక్స్ట్ సినిమాను లోకేష్ కనగరాజ్ తో స్టార్ట్ చేశాడు. కాబట్టి, త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ సినిమాను ఎన్టీఆర్ తో చేయడం కన్ఫర్మ్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక అప్పటినుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
ఇక రీసెంట్ గా జరిగిన ఒక ఈవెంట్ లో నిర్మాత నాగ వంశీ కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. త్వరలోనే ఒక బిగ్ అప్డేట్ రానుంది అంటూ హింట్ ఇచ్చాడు. ఆ అప్డేట్ తప్పకుండా ఎన్టీఆర్- త్రివిక్రమ్ సినిమా గురించే అయ్యుంటుందని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అందుకే. ఇక తగ్గేదే లే అంటూ సోషల్ మీడియాలో గాడ్ ఆఫ్ వార్ అంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు.