45 OTT: ఓటీటీలో సూపర్ హిట్ మూవీ ’45’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కన్నడ స్టార్స్ శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బీ శెట్టి ప్రధాన పాత్రలు చేసిన '45(45 OTT)' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి అధికారిక ప్రకటన వచ్చింది.
Kannada super hit movie 45 ott streaming update
- కన్నడ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ 45 మూవీ
- ఓటీటీ రిలీజ్ పై అధికారిక ప్రకటన
- జనవరి 23 నుంచి స్ట్రీమింగ్
45 OTT: కన్నడ ఇండస్ట్రీలో ఈమధ్య కాలంలో వచ్చిన భారీ మల్టీస్టారర్ మూవీ 45 అనే చెప్పాలి. ఈ సినిమాలో కన్నడ స్టార్స్ శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బీ శెట్టి ప్రధాన పాత్రలు చేశారు. సరికొత్త కథలో, భారీ గ్రాఫిక్స్ తో, విజువల్ వండర్ గా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు అర్జున్ జన్యా తెరకెక్కించాడు. టీజర్, ట్రైలర్ తో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
విడుదల తరువాత కూడా ఆడియన్స్ నుంచి మంచి టాక్ తెచ్చుకుంది. ఇక తెలుగులో ఈ సినిమా జనవరి 1న విడుదల అయ్యింది. అయితే, తాజాగా 45 మూవీ ఓటీటీ విడుదల గురించి అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. 45 మూవీ ఓటీటీ(45 OTT) హక్కులను జీ 5 సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సినిమా విడుదలైన సరిగ్గా నెలకి అంటే జనవరి 23 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు.
అదే రోజు నుంచి తెలుగులో కూడా స్ట్రీమింగ్ వచ్చే అవకాశం ఉంది ఈ సినిమా. కానీ, ఆ విషయం గురించి పోస్టర్ లో మెన్షన్ చేయలేదు. మరి థియేటర్స్ లో మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ఓటీటీ ఆడియన్స్ ఎలాంటి రిజల్ట్ ను ఇస్తారు అనేది చూడాలి.
45 The Biggest Movie Of 2025
45 Streaming On Jan 23rd In Kannada Zee5#45TheMovie #KannadaZEE5 #45OnZEE5 #ZEE5Cinemas #ZEE5 pic.twitter.com/uUFZWCE04Y
— ZEE5 Kannada (@ZEE5Kannada) January 16, 2026
